Liver Diseases: ఈ లక్షణాలు కనిపిస్తుంటే బీ అలర్ట్.. కాలేయం ప్రమాదంలో ఉన్నట్లే..

మానవ శరీరంలో చర్మం తర్వాత అతి పెద్ద అవయవం కాలేయం.. విలక్షణమైన గుణాలు కలిగి ఉన్న కాలేయం ఆరోగ్యంగా లేకపోతె.. ప్రాణాపాయం కొని తెచ్చుకున్నట్లే.. అందుకనే కాలేయ అనారోగ్య సమస్యలను వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే.. సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించవచ్చు. కాలేయం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు. కాలేయం ఆరోగ్యంగా లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు. కాలేయంలో వ్యాధి వేళ్ళూనుకున్నప్పుడు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది మొదట వాటిని పట్టించుకోరు. ఫలితం ప్రాణాంతకం కావచ్చు.  కనుక కాలేయ వ్యాధి ప్రారంభ లక్షణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Feb 26, 2024 | 11:37 AM

నేటి మనవ జీవన విధానం క్రమరహితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీంతో ఈ అలవాట్లు  కాలేయంపై తీవ్ర  ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆల్కహాల్ తాగడం వల్ల డిటాక్సిఫికేషన్, మెటబాలిజం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఆల్కహాల్ తీసుకోకపోయినా ఈ సమస్యలన్నీ వస్తాయి

1 / 8
నిరంతర అలసట, బలహీనత కాలేయ వ్యాధి ప్రారంభ లక్షణాలు. ఆహారాన్ని జీర్ణం చేయడంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే అలసట, బలహీనంగా ఉంటారు. మొదట్లో విశ్రాంతి తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాకపోతే వైద్య సలహా తీసుకోండి

2 / 8
కడుపు నొప్పి లేదా అసౌకర్యం కాలేయ సమస్యల వల్ల సంభవించవచ్చు. ప్రత్యేకించి పొత్తికడుపు కుడివైపు పైభాగంలో కాలేయం ఉన్న చోట  నొప్పి లేదా సున్నితత్వం ఉంటే కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండండి. అంతేకాదు నొప్పిని తీవ్రతరం చేసే ఆహారాన్ని తినడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కూడా నొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

3 / 8
కడుపు నొప్పితో పాటు, కళ్ళు లేదా చర్మం పసుపులోకి మారినా.. మూత్రం పసుపు రంగులో ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇది జాండిస్‌కు సంకేతం. రక్తంలో బిలిరుబిన్ స్థాయిలో హెచ్చుతగ్గులు  హెపటైటిస్ లేదా కామెర్లుకి దారితీయవచ్చు.

4 / 8
కడుపులో అసౌకర్యంగా ఉన్నా లేత లేదా నలుపు రంగులో మలం ఉన్నా అప్రమత్తంగా ఉండండి. కాలేయం పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. పిత్త రసం తక్కువగా ఉత్పత్తి చేయబడితే లేదా పిత్త ప్రవాహానికి ఆటంకం కలిగితే మలం లేత పసుపు రంగులో ఉండవచ్చు. లేదా కాలేయంలో పుండు (గాయం)ఉన్నా మలంలో రక్తం పడే అవకాశం ఉంది. అంతేకాదు మలం రంగు నలుపుగా ఉంటుంది. 

5 / 8
కాలేయం రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్‌లను తయారు చేస్తుంది. కాలేయం సరిగ్గా జీవక్రియ చేయకపోతే లేదా కాలేయ పనితీరు బలహీనంగా ఉంటే రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లు ఉత్పత్తి చేయబడవు. ఫలితంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు చిన్న గాయం అయినా సరే ఎక్కువ సమయం రక్తస్రావం అవుతుంది. 

6 / 8
కాలేయంలో వ్యాధి ఉంటే జీవక్రియ సరిగ్గా పనిచేయదు. ఆకలి లేకపోవడం, అజీర్ణం, వికారం, వాంతులు, తరచుగా ప్రేగు కదలికలు వంటి లక్షణాలకు దారితీస్తుంది. స్థిరంగా బరువు తగ్గడంతో పాటు, శరీరం ఎల్లప్పుడూ అసౌకర్యంగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. పొత్తికడుపు, చీలమండల వాపు కూడా కాలేయ సమస్య  లక్షణం

7 / 8
కాలేయ సమస్యలు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ప్రోటీన్ జీవక్రియ సమయంలో అమ్మోనియా ఉత్పత్తి అవుతుంది. కాలేయం దీనిని యూరియాగా మార్చి మూత్రంలో విసర్జిస్తుంది. కాలేయం సరిగా పనిచేయనప్పుడు అమ్మోనియా వంటి విషపదార్ధాలు రక్తప్రవాహంలో పేరుకుపోతాయి. దీని వల్ల లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, మానసిక గందరగోళం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. 

8 / 8
Follow us