AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలంటే.. కంచి కామకోటి పీఠాధిపతి అమృత భాషణం..

జగద్గురు కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేపట్టిన విజయ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామికి ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభతో ఘనంగా స్వాగతం పలికారు.

ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలంటే.. కంచి కామకోటి పీఠాధిపతి అమృత భాషణం..
Shankara Vijayendra Swamy
J Y Nagi Reddy
| Edited By: Srikar T|

Updated on: Feb 26, 2024 | 5:35 PM

Share

జగద్గురు కంచి కామకోఠి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేపట్టిన విజయ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామికి ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభతో ఘనంగా స్వాగతం పలికారు. క్షేత్రంలోని శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామికి అభిషేకాలు, కుంకుమార్చనలు స్వామివారు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న పోచా విశ్రాంతి భవనంలో విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామి వారు మాట్లడుతూ దేశం ప్రతి ఒక్క హిందూ ధర్మపరిరక్షణ కోసం కృషి చేస్తూ, ధర్మాన్ని కాపాడాలని సూచించారు. మన సనాతన ధర్మం గురించి చిన్నపిల్లలకు చెబుతూ ప్రోత్సహించడం చాలా అవసరం అన్నారు. హిందూ ధర్మంలో భగవంతుని ఆరాధన ఎంతో ముఖ్యం కావున ప్రతి ఆలయంలో, ఇంట్లో నిత్య పూజలు చెయ్యాలని అప్పుడే ఆ ఇల్లు, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా మహానంది ఆలయం విశిష్టత గురించి చెబుతు స్వయంభువుగా వెలసిన మహానందీశ్వర స్వామి ఎంతో మహిమాన్విత గల దేవుడని స్వామి దర్శించి కోరుక్కున్న కోరెక్కలు తీర్చే గొప్ప క్షేత్రం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…