Andhra Pradesh: తండ్రిని వాహనంతో ఢీకొట్టి.. తుపాకితో బెదిరించి కూతురు కిడ్నాప్.. చివరికి..!
కర్నూలు జిల్లాలో పట్టపగలు కిడ్నాప్ కలకలం సృష్టించింది. తుపాకులతో బెదిరించి కన్న తండ్రి ముందే కుమార్తెను తీసుకెళ్లిపోయారు దుండగులు. పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన వరదరాజుల కుమార్తెతో బైక్‌పై వెళ్తున్నారు. అంతలో అడ్డుగా వచ్చిన దుండగులు తండ్రిపై దాడి చేసి కూతురుని కిడ్పాప్ చేశారు.
కర్నూలు జిల్లాలో పట్టపగలు కిడ్నాప్ కలకలం సృష్టించింది. తుపాకులతో బెదిరించి కన్న తండ్రి ముందే కుమార్తెను తీసుకెళ్లిపోయారు దుండగులు. పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన వరదరాజుల కుమార్తెతో బైక్‌పై వెళ్తున్నారు. దూదేకొండ గ్రామ సమీపంలోని రాగానే పథకం ప్రకారం దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ నాయుడు తన మిత్రులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. తన ముగ్గురి స్నేహితులతో కలిసి స్కార్పియో వాహనంతో బైకును ఢీకొట్టారు. కింద పడిపోయిన వరదరాజులుకు తుపాకితో గురి పెట్టి బెదిరించారు.
వరదరాజులు కుమార్తెను స్కార్పియో వాహనంలో బలవంతంగా ఎక్కించుకున్న దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. కిందపడిపోయిన వరదరాజులు గాయాలతో పత్తికొండ పోలీస్ స్టేషన్ చేరి కిడ్నాప్ సమాచారం పోలీసులకు అందించారు అప్రమతమైన పోలీసులు హోసూర్ మెలగవల్లి ఆదోని వెళ్తున్న వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. ఆలూరు పరిధిలో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, సత్యనారాయణతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు. ఇదిలావుంటే కిడ్నాప్‌నకు పాల్పడిన నిందుతుల వరదరాజులకు బంధువులు కావడం విశేషం.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…