Watch Video: చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా.. బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబుని తాను నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తానన్నారు ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబుపై ప్రేమ రెట్టింపు అవుతుందే తప్ప.. రవ్వంత కూడా తగ్గదన్నారు. చంద్రబాబు రాముడైతే..తాను హనుమంతుడి లాంటివాడినన్నారు. ఇందులో మరో ప్రశ్నకు తావులేదన్నారు. విజయవాడ వెస్ట్ సీటు తనకు ఇస్తారని ఆశించినట్లు వెల్లడించారు.
చంద్రబాబుని తాను నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తానన్నారు ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబుపై ప్రేమ రెట్టింపు అవుతుందే తప్ప.. రవ్వంత కూడా తగ్గదన్నారు. చంద్రబాబు రాముడైతే..తాను హనుమంతుడి లాంటివాడినన్నారు. ఇందులో మరో ప్రశ్నకు తావులేదన్నారు. విజయవాడ వెస్ట్ సీటు తనకు ఇస్తారని ఆశించినట్లు వెల్లడించారు. దేశంలో ఏ నాయకుడు నాలాగ రక్తాభిషేకం చేయలేదన్నారు. ఇటీవల సీబీఎన్ జిందాబాద్ అంటూ బుద్ధా వెంకన్న తన రక్తంతో రాయడం తెలిసిందే. చివరి రక్తపు బొట్టు వరకు బాబుతోనే ఉంటామని తన అనుచరుల ఆత్మీయ సమావేశంలో ఆయన చెప్పారు. తానే కార్యక్రమం చేసినా.. అది ఇంకో విధంగా ప్రజల్లోకి వెళ్తోందని.. ఇకపై ఏ మీటింగ్స్ పెట్టను, టికెట్ పేరెత్తను అని బుద్ధా వెంకన్న చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..
వైరల్ వీడియోలు
Latest Videos