AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 2వ రోజు సీఎం చంద్రబాబు పర్యటన

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 2వ రోజు సీఎం చంద్రబాబు పర్యటన

Janardhan Veluru
|

Updated on: Oct 30, 2026 | 3:40 PM

Share

తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Andhra Pradesh CM Nara Chandrababu Naidu) ఏరియల్ సర్వే నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Cyclone Arnab Effect: తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు ఏరియల్ సర్వే నిర్వహించారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చేరుకున్నారు. మొగల్తూరు, నరసాపురం మండలాల్లో పర్యటిస్తూ తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నరసాపురం మండలం కొత్తనవరసపురంలో నీట మునిగిన పంట పొలాలను సీఎం సందర్శించారు. బాధిత రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుఫాను వల్ల జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందం కూడా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుందని చంద్రబాబు రైతులకు తెలిపారు. నష్ట వివరాలను పరిశీలించి రైతులకు సహాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

Published on: Oct 30, 2026 03:40 PM
Follow Us