Vizag: ఎస్సైపై మందుబాబు చిందులు.. నన్నేం చేయలేవ్ అంటూ

' నువ్వు పోలీస్ అయితే నాకేంటి.. నాకు భయం లేదు.. చూసుకుందాం..' అంటూ ఓ మందు బాబు ఏకంగా ఎస్ఐ ర్యాంక్ అధికారినే బెదిరించాడు. అంతటితో ఆగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి రికార్డులు లేని వాహనాన్ని తరలిస్తుండగా అడ్డుపడి వీరంగం సృష్టించాడు. బైక్ కు ఎదురుగా నిలబడి.. ఫ్రంట్ వీల్ ముందు చక్రాన్ని రెండు కాళ్ల మధ్య నొక్కిపెట్టి అడ్డంగా నిల్చున్నాడు.

Vizag: ఎస్సైపై మందుబాబు చిందులు.. నన్నేం చేయలేవ్ అంటూ
Drunk Man
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 26, 2024 | 1:44 PM

ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 26: అది విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్.. వీకెండ్ కావడంతో రద్దీగా ఉంది. పొద్దు పోవడంతో పర్యాటకులు, సందర్శకుల హడావిడి పెరిగింది. అదే సమయంలో మద్యం మత్తులో వాహనాల నడిపి ప్రమాదాల కారణమైన వారిపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇంతలో.. ఒక్కసారిగా మద్యం మత్తులో యువకుడు ఎస్సైతోనే గొడవకు దిగాడు.

‘ నువ్వు పోలీస్ అయితే నాకేంటి.. నాకు భయం లేదు.. చూసుకుందాం..’ అంటూ ఓ మందు బాబు ఏకంగా ఎస్ఐ ర్యాంక్ అధికారినే బెదిరించాడు. అంతటితో ఆగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి రికార్డులు లేని వాహనాన్ని తరలిస్తుండగా అడ్డుపడి వీరంగం సృష్టించాడు. బైక్ కు ఎదురుగా నిలబడి.. ఫ్రంట్ వీల్ ముందు చక్రాన్ని రెండు కాళ్ల మధ్య నొక్కిపెట్టి అడ్డంగా నిల్చున్నాడు. అక్కడంతా హంగామా సృష్టించాడు. వాహనాన్ని కదలనివ్వకుండా అడ్డుకొని దుర్భాషలాడాడు. అసలు విషయం ఏంటంటే.. వీకెండ్ కావడంతో బీచ్ రోడ్డుకు భారీగా రద్దీ పెరిగింది. అదే సమయంలో భద్రత నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. మద్యం మత్తులో వచ్చే వారిపై కన్నేసి పెట్టారు. మద్యం మత్తులో వాహనాలతో బీచ్ రోడ్ లో వెళ్తే పర్యటకు ప్రమాదం ఉంచి ఉన్న నేపథ్యంలో.. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పార్క్ హోటల్ జంక్షన్ లో కొంతమంది పోలీసులు కాపు కాసారు. ట్రాఫిక్ ఆర్ఎస్ఐ మనోహర్ ఆధ్వర్యంలో.. ఓ టీం తనిఖీలు చేస్తుంది. ఇదే సమయంలో ఓ బైక్ ను ఆపిన పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దీంతోపాటు వాహనానికి రికార్డులు కూడా తనిఖీ చేశారు. మద్యం మత్తులో ఉండడంతో పాటు.. వాహనానికి సరైన రికార్డులు లేకపోవడంతో.. ఆ వాహనాన్ని సీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.

ఇందులో భాగంగా బైక్ ను యార్డ్‌కు తరలించే క్రమంలో వాహనాన్ని స్వాధీనం చేసుకుని తీసుకెళ్ళేందుకు సిద్ధమయ్యారు ఆర్ఎస్ఐ మనోహర్. దీంతో ఆ వాహనానికి అడ్డగించి.. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు నానా హంగామా చేసాడు. వాహనానికి అడ్డుపడి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. పోలీసులు, ఎస్ఐ సర్ది చెప్పిన వినకుండా నువ్వు పోలీస్ అయితే నాకేంటి నాకు భయం లేదు అంటూ.. గదమాయించాడు. ఎస్సైకి వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు. దీంతో అటుగా వెళ్తున్న వారంతా పెద్ద ఎత్తున గుమిగూడారు. చివరకు మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…