TTD: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై వేటు. ఎందుకో తెలుసా..?
తిరుమల ఆలయ అర్చకత్వంలో రమణ దీక్షితులదీ ప్రత్యేక స్థానం. వంశపార్యపర్యంగా తిరుమల శ్రీవారికి కైకర్యాల బాధ్యతలు చేపడుతున్న మిరాశి కుటుంబానికి చెందిన రమణ దీక్షితులు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంకు రమణ దీక్షితులకు మధ్య గ్యాప్ పెరిగింది. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలను విభేదిస్తూ వస్తున్న రమణ దీక్షితులు చేస్తున్న కామెంట్స్ చర్చగా మారాయి.

ఈ నేపథ్యంలోనే 5 రోజుల క్రితం శ్రీవారి ఆలయ ప్రతిష్ట దిగజార్చుతూ రమణ దీక్షితులు రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు టీటీడీ ఈవో, జీయర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు రమణ దీక్షితులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అయ్యింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా కొనసాగుతూ రమణ దీక్షితులు చేసినట్లు గా వైరల్ అవుతున్న వీడియో పై ఎట్టకేలకు టీటీడీ పాలక మండలి స్పందించింది. రమణ దీక్షితులు తీరును తప్పుపడుతూ ఆయనను విధుల్లో నుంచి తొలగించింది.
రమణ దీక్షితుల తొలగింపు వ్యవహారం చర్చగా మారింది. అన్నమయ్య భవన్‌లో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశం రమణ దీక్షితులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. టీటీడీ బోర్డు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ప్రకటించిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రమణ దీక్షితుల తీరును తప్పు పట్టారు. మరోవైపు ఇప్పటికే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై రెండ్రోజుల క్రితమే తిరుమల 1టౌన్ పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. రమణదీక్షితులు పై చర్యలకు టీటీడీ సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఉద్యోగి మురళీ సందీప్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే వీడియో తనను షాక్ కు గురిచేసిందంటూ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చిన రమణ దీక్షితులు, రెండు రోజుల క్రితం ఆ వాయిస్ తనది కాదని మీడియా ముందుకు వచ్చారు. మార్ఫింగ్ చేశారన్నారు రమణ దీక్షితులు. అయితే ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. మీడియాకు వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న పోలీసులు, తన వాయిస్ కాదంటున్న రమణ దీక్షితులు ఆడియోను ఎఫ్ఎస్ఎల్ కు పంపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…