AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. ఏం నష్టపోతారో తెలుసా?

ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా మంచి శారీరక, మానసిక ఆరోగ్యానికి 7 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. కానీ నేటి కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్రపోలేకపోతున్నామని..

రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. ఏం నష్టపోతారో తెలుసా?
Sleep Deprivation
Srilakshmi C
|

Updated on: Dec 16, 2025 | 12:05 PM

Share

ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా మంచి శారీరక, మానసిక ఆరోగ్యానికి 7 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. కానీ నేటి కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్రపోలేకపోతున్నామని వీరు తరచూ చెబుతుంటారు. ప్రతిరోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఎన్ని సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే జరిగేదిదే..

మెదడు సరిగ్గా పనిచేయదు

మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోకపోతే మీ మెదడు సరిగ్గా పనిచేయదు. మీరు ఏకాగ్రతను కోల్పోతారు. కాబట్టి మీరు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.

ముఖంపై ముడతలు

నిద్ర లేకపోవడం వల్ల చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన చర్మంపై ముడతలు, నల్లటి వలయాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

హార్మోన్ల అసమతుల్యత

నిద్ర లేకపోవడం ప్రధానంగా హార్మోన్ల వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఆందోళన, చిరాకు, రక్తపోటు, ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల శరీర ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతింటుంది. కాలక్రమేణా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

నిద్ర లేకపోవడం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా మీరు తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

జ్ఞాపకశక్తి కోల్పోవడం

తగినంత నిద్ర లేకపోతే, దాని ప్రభావాలు మెదడుపై కనిపిస్తాయి. ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కూడా దారితీస్తుంది. అలాగే మంచి రాత్రి నిద్ర లేకపోతే, ఏకాగ్రత, నిర్ణయం తీసుకోవడంపై ప్రభావం చూపుతుంది.

దీర్ఘకాలిక వ్యాధులు

రోజుకు ఆరు గంటల కన్నా తక్కువ నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్, ఊబకాయం, మధుమేహం, నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.

గమనిక: ఇందులో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వాటిని మేము నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.