చేపలతో వీటిని కలిపి తిన్నారో.. విషం తీసుకున్నట్లే! కాస్త చూస్కోండి..
భోజన ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో చేపలు ఒకటి. చేపల పులుసు, క్రిస్పీ చేపల ఫ్రైస్ ఇలా రకరకాల రుచులను ఆస్వాధిస్తుంటారు. చేపలు రుచిగా ఉండటమే కాదు ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు, ప్రోటీన్లు ఇందులో దండిగా ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలతో చేపలు తినడం వల్ల అవి శరీరంలో విషపూరిత ప్రతిచర్యలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు..

భోజన ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో చేపలు ఒకటి. చేపల పులుసు, క్రిస్పీ చేపల ఫ్రైస్ ఇలా రకరకాల రుచులను ఆస్వాధిస్తుంటారు. చేపలు రుచిగా ఉండటమే కాదు ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు, ప్రోటీన్లు ఇందులో దండిగా ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలతో చేపలు తినడం వల్ల అవి శరీరంలో విషపూరిత ప్రతిచర్యలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా చేపలలోని పోషకాలను గ్రహించడానికి బదులుగా, జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి. అలాంటి కాంబినేషన్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
చేపలు తినే సమయంలో పెరుగు, పాలు, మజ్జిగ, జున్ను వంటి పాల ఉత్పత్తులను తినకూడదు. ఎందుకంటే చేపలు, పాల ఉత్పత్తులు రెండింటిలోనూ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. రెండింటిలోనూ సమ్మేళనాలు కలిస్తే జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి. ఇది కడుపు నొప్పి, అసౌకర్యం, గ్యాస్, తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. చేపలతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయలు ఇతర సిట్రస్ పండ్లను తినడం మానుకోవాలి. ఎందుకంటే విటమిన్ సి, చేపలు తీవ్రమైన జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రుచికి కొద్దిగా నిమ్మరసం సరైనదే, కానీ ఎక్కువగా తీసుకోకూడదు.
అలాగే పాలకూర, కొత్తిమీర వంటి కొన్ని ఆకుకూరలను చేపలతో కలిపి ఎక్కువగా తినకూడదు. వీటిని ఎక్కువ పరిమాణంలో తింటే, శరీరం చేపలలోని కాల్షియంను సరిగ్గా గ్రహించదు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వస్తుంది. చేపలు తిన్న వెంటనే స్వీట్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చేపలతో మద్యం లేదా వైన్ తాగే అలవాటు ఉంటే వెంటనే దానిని మానేయడం మంచిది. ఇది కాలేయంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. చేపలు తిన్న వెంటనే మద్యం తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
గమనిక: ఇందులో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వాటిని మేము నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు నిపుణుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








