ఏంటి దీని వెనక ఇంత కథుందా.. చలికాలంలో కొబ్బరి నూనె ఎందుకు గడ్డకడుతుందో తెలుసా?
Why Coconut Oil Solidifies in Winter: చలికాలం రాగానే ప్రతి ఇంట్లోనూ ఎదురయ్యే అనుభవం కొబ్బరి నూనె గడ్డకట్టడం. వంటగదిలోని లేదా బాత్రూమ్‌లోని కొబ్బరి నూనె డబ్బా గట్టిగా, తెల్లటి ముద్దగా మారిపోతుంది. వేసవిలో స్పష్టంగా ద్రవ రూపంలో ఉండే నూనె ఉష్ణోగ్రత తగ్గగానే ఎందుకు గడ్డకడుతుంది? ఇది కేవలం చలి ప్రభావమేనా లేక దీని వెనుక ఇంకేమైనా సైన్స్ ఉందా? తెలుసుకుందాం పదండి.

చలికాలం రాగానే ప్రతి ఇంట్లోనూ ఎదురయ్యే అనుభవం కొబ్బరి నూనె గడ్డకట్టడం. అసలు కొబ్బరి నూనె గడ్డకట్టడానికి ప్రధాన కారణం దానిలోని రసాయన నిర్మాణం. కొబ్బరి నూనెలో దాదాపు 90 శాతం సంతృప్త కొవ్వు ఆమ్లాలు (Saturated Fatty Acids) ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు), ముఖ్యంగా లారిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. సంతృప్త కొవ్వు ఆమ్లాల వీటి రసాయన నిర్మాణం సరళంగా ఉంటుంది. దీనివల్ల చల్లబడినప్పుడు, ఈ అణువులు సులభంగా ఒకదానితో ఒకటి దగ్గరగా చేరి క్రమబద్ధమైన స్ఫటిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ స్ఫటికాలే మనం చూసే గడ్డకట్టిన రూపం. క్లిష్టమైన ఉష్ణోగ్రత వద్ద కొబ్బరి నూనె ద్రవ రూపం నుండి ఘన రూపంలోకి మారే ఉష్ణోగ్రతను దాని ద్రవీభవన స్థానం అంటారు.
కొబ్బరి నూనె ద్రవీభవన స్థానం: సాధారణంగా ఇది 24 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ మధ్య ఉంటుంది. రూమ్ టెంపరేచర్ 24 డిగ్రీల కంటే కంటే తక్కువగా ఉన్నప్పుడు (చలికాలంలో ఇది చాలా సాధారణం) నూనె గడ్డకట్టడం మొదలవుతుంది. వేరే ఏ నూనె (ఉదాహరణకు, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్) కంటే కొబ్బరి నూనెకు ఈ ద్రవీభవన స్థానం తక్కువగా ఉంటుంది.
ఇతర నూనెలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి, అవి సరళంగా ఉండవు కాబట్టి సులభంగా గడ్డకట్టవు. కొబ్బరి నూనె గడ్డకట్టడం అనేది దాని స్వచ్ఛతకు నిదర్శనం. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ. ఇది నూనె నాణ్యతను ఏ విధంగానూ దెబ్బతీయదు. కాబట్టి, మళ్లీ ద్రవ రూపంలోకి మార్చాలంటే, డబ్బాను గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




