Elon Musk: తిరుగులేని ఎలాన్ మస్క్.. సంపదలో మరో సంచలనం.. ప్రపంచంలోనే వన్‌మెన్..
ప్రపంచ కబేరుడు ఎలాన్ మస్క్ సంపాదన పరంగా రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఆయన సంపద రికార్డు స్థాయిలో ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దీంతో తాజాగా మస్క్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే 600 బిలియన్ల డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు.

Elon Musk Income: ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ఆదాయం రికార్డ్ స్థాయిలో పెరుగుతూనే పోతుంది. వ్యాపారాలను అన్ని దేశాలకు విస్తరిస్తుండటం, కొత్త కంపెనీలను సృష్టిస్తుండటంతో ఆయన సంపద హైక్ అవుతూనే ఉంది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రస్తుతం వరల్డ్‌లోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న రాకెట్ తయారీ సంస్థ స్పేస్‌ఎక్స్ ఐపీఓ విలువ భారీగా పెరుగుతోంది. దీంతో ఎలాన్ మస్క్ సంపాదన కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నట్లు తాజాగా ఫోర్ట్స్ వెల్లడించింది. సోమవారం నాటికి ఆయన సంపద విలువ 677 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది.
ప్రపంచంలోనే రికార్డ్
సంపద విలువ 677 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే 600 బిలియన్ల డాలర్ల సంపాదన కలిగిన తొలి వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటికే వరల్డ్‌లోనే ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మస్క్.. ఇప్పుడు సరికొత్త రికార్డ్ సృష్టించి మరో ఘనత సాధించాడు. 2020 మార్చిలో కేవలం 24.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద.. 2025 అక్టోబర్ నాటికి 500 బిలియన్ డాలర్లుకు పెరిగింది. ఐదేళ్లల్లోనే ఆమాంతం పెరగడం మరో విశేషం.
టెస్లా, స్పేస్ఎక్స్ కీలకం
మస్క్ సంపాదనలో టెస్లా, స్పేస్‌ఎక్స్ కీలకంగా ఉన్నాయి త్వరలో స్పేస్‌ఎక్స్ ఐపీఓకు వెళ్లనుంది. ఏకంగా 800 బిలియన్ డాలర్లతో ఐపీఓకు వెళ్లనుందని వార్తలు వస్తున్న క్రమంలో మాస్క్ ఆదాయం మరింత పెరిగింది. స్పేస్ ఎక్స్‌లో మస్క్ 42 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇక టెస్లాలో మస్క్ 12 శాతం వాటా కలిగి ఉన్నారు. దీంతో పాటు ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐ హోల్డింగ్స్‌లో మస్క్‌కు 53 శాతం వాటా ఉంది. దీంతో మస్క్ సంపద అంతకంతకు పెరుగుతూనే వస్తోంది. ఇక వివిధ వ్యాపారాల్లోనూ మస్క్ భాగస్వామిగా ఉన్నారు.




