AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిరాకిల్.. చిన్న గాటుతోనే ఫ్రీగా గుండె ఆపరేషన్.. చరిత్ర సృష్టించిన SMSIMSR

అత్యాధునిక కార్డియాక్ కేర్ కేవలం సంపన్నులకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ అందాలన్న దృక్పథంతో ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ’ మిషన్‌ లక్ష్యంతో నడిచే శ్రీ మధుసూదన్‌ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి, మరో మైలురాయిని సాధించింది.

మిరాకిల్.. చిన్న గాటుతోనే ఫ్రీగా గుండె ఆపరేషన్.. చరిత్ర సృష్టించిన SMSIMSR
Heart Operation in SMSIMSR
Shaik Madar Saheb
|

Updated on: Dec 16, 2025 | 12:28 PM

Share

సత్య సాయి గ్రామం, ముద్దెనహళ్లి, 16 డిసెంబర్‌ 2025: అత్యాధునిక కార్డియాక్ కేర్ కేవలం సంపన్నులకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ అందాలన్న దృక్పథంతో ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ’ మిషన్‌ లక్ష్యంతో నడిచే శ్రీ మధుసూదన్‌ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి, మరో మైలురాయిని సాధించింది. దీంతో ప్రపంచంలోనే ఈ శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్న తొలి ఆస్పత్రిగా SMSIMSR చరిత్ర సృష్టించింది. భారతదేశంలో ఈ అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ చికిత్సనందించే మూడో హాస్పిటల్‌గా కూడా గుర్తింపు పొందింది. కోల్‌కతాలోని మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ సర్దార్ బృందంతో కలిసి శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హార్ట్ వాల్వ్ బ్యాంక్ డైరెక్టర్, చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సిఎస్ హిరేమత్ నేతృత్వంలో SMSIMSR బృందం డిసెంబర్ 13న బెంగళూరుకి చెందిన 29 ఏళ్ల యువతికి టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది.

Sri Madhusudan Sai Institute Of Medical Sciences And Research

Sri Madhusudan Sai Institute Of Medical Sciences And Research

ఫలితంగా చిన్నవయసులో పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న ఆమెకు కొత్త జీవితాన్ని, ఆమె కన్న కలలను సాకారం చేసుకునే అవకాశాన్ని అందించింది. ఈ మినిమల్ ఇన్వేసివ్ శస్త్రచికిత్సను అత్యాధునిక పరికరాల సహాయంతో నిర్వహించారు. దీని ఫలితంగా గాయం పరిమాణం 2 సెం.మీ. కన్నా తక్కువగా ఉండి, రోగి వేగంగా కోలుకొని 72 గంటలలోనే డిశ్చార్జ్‌ అయ్యింది. విజయవంతమైన ఈ వైద్యం ద్వారా రోగులు వేగంగా కోలుకోవడంతో పాటు తక్కువ గాయాలతో సురక్షితమైన హృదయ శస్త్రచికిత్సలు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతను స్వీకరించడంలో SMSIMSR వైద్య బృందం నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తోంది.

Heart Operation In Smsimsr

భారతదేశంలో టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని నిర్వహించిన మూడవ కేంద్రంగా, ప్రపంచంలోనే దీన్ని ఉచితంగా అందించే మొట్టమొదటి కేంద్రంగా SMSIMSR అవతరించింది.

ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక నైపుణ్యం, వినూత్న ఆవిష్కరణల ద్వారా సమాజ సేవ కోసం అంకితభావంతో ముందుకు సాగుతోన్న SMSIMSR, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌ యొక్క నిబద్ధత ఇలాంటి మరెన్నో విప్లవాత్మక వైద్య కార్యక్రమాలకు అద్దం పడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..