- Telugu News Photo Gallery Snake gourd is a panacea for many diseases you will be surprised to know its benefits
పాములాంటి ఈ కూరగాయ ఆరోగ్యానికి వరం.. లాభాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు..!
పాములాంటి ఈ కూరగాయ పోషకాల నిధి, పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగింఏ ఔషధగని. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. డయాబెటిస్ వ్యాధులు కూడా హ్యాపీగా తినొచ్చు. అవును.. ఇంతకీ ఈ కూరగాయ పేరోంటో చెప్పలేదు కదా..అదినండోయ్ పొట్లకాయ.. దీన్ని తింటే పుట్టేడు ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. ఆ లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Oct 17, 2025 | 8:57 AM

జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి, మీరు మీ ఆహారంలో పొట్లకాయను చేర్చుకోవచ్చు. ఈ కూరగాయలో కరిగే, కరగని తినదగిన ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో తోడ్పడుతుంది. మీరు డయాబెటిస్ తో బాధపడుతుంటే, పొట్లకాయ చాలా ప్రయోజనకరం. పోట్లకాయలో డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.

పొట్లకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పొట్లకాయలో కుకుర్బిటాసిన్ బి, ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ గొలుసు ప్రతిచర్యను నిరోధించడానికి పనిచేస్తాయి.

పొట్లకాయలో కేలరీలు చాలా తక్కువగా, నీరు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఊబకాయంతో పోరాడుతుంటే, ఈ కూరగాయను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

పొట్లకాయలో రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడే లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం, జ్వరం, దగ్, శ్వాసకోశ సమస్యలకు కూడా పొట్లకాయ ప్రయోజనకరంగా ఉంటుంది.

కామెర్లు ఉన్న రోగులు పొట్లకాయ తినమని సలహా ఇస్తారు. పొట్లకాయ ఆకులు కూడా ఔషధంగా పనిచేస్తాయి. ఈ ఆకులు, స్పూన్ ధనియాలు రెండు గ్లాసుల నీటిని కలిపి బాగా మరిగించి తీసుకుంటే.. కామెర్లు అనే ప్రాణాంతక వ్యాధి త్వరగా నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.




