- Telugu News Photo Gallery Do you suffer from back pain while sleeping? You should avoid these foods.
నిద్రపోతున్నప్పుడు వెన్ను నొప్పి వేధిస్తోందా.? ఈ ఫుడ్స్‌ని దూరం పెట్టాల్సిందే..
ప్రస్తుత జీవనశైలి కారణంగా వెన్నెముక బలహీనంగా మారుతోంది. ఈ తరుణంలో తినే ఆహారం, తీసుకొనే పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మీ డైట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ వెన్నెముకను బలంగా మారుస్తుంది. లేదంటే సమస్య మీరింత ఎక్కువ అవుతుంది. వెన్నెముక బలంగా ఉండాలంటే కొన్ని ఆహారలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు నిద్ర సమయంలో వెన్నునొప్పితో బాధపడేవారు తినకూడని ఆహారాలు ఏంటో చూద్దామా మరి.
Updated on: Oct 01, 2025 | 12:45 PM

అధిక ప్రొటీన్లు: ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఎసిడిటీ పెరుగుతూంది. దీని కారణంగా బాడీలో ఉన్న కాల్షియం మొత్తం టాయిలెట్ రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీంతో వెన్నునొప్పి వస్తుంది. అందుకే ప్రోటీన్ పరిమితలో తీసుకోవడం అలవాటు చేసుకుంది. అధిక ప్రోటీన్ ఎముకలను దెబ్బతీస్తుంది.

కార్బొనేటెడ్ డ్రింక్స్: మీ ఎప్పుడు ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే శీతల పానీయాలు, షాంపైన్ వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్ జోలికి అస్సలు వెళ్ళవద్దు. ఈ పానీయలలో ఉన్న అధిక ఫాస్ఫేట్ శరీరంలో కాల్షియంను తగ్గిస్తుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇది వెన్ను నొప్పికి దారి తీస్తుంది.

గ్యాస్‌కు సంబంధించిన మందులు: అసిడిటీకి సంబంధించిన మందుల ఎక్కువగా వాడిన కూడా వెన్ను నొప్పి వస్తుంది. ఇలా చేయడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలను గ్రహించడం శరీరానికి కష్టంగా మారుతుంది. దీంతో మీ ఎముకలు బలహిపడతాయి.

కెఫిన్ తీసుకోవడం: కెఫిన్‌ను తీసుకోవడం లిమిట్ చేసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి. కెఫీన్ అధికం ఉంటె కాఫీ, టీ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అలాంటి వారికి కాల్షియం కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది.

విటమిన్ డి లోపం: శరీరంలో ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం, విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ డిలో కాల్షియం ఉన్నందున ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లబిస్తుంది. అందువల్ల, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.

పోషక లోపాలు: ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్,టెస్టోస్టెరాన్ వంటి పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడానికి అవసరం. పెరుగుతున్న వయస్సుతో శరీరానికి అవసరమైన హార్మోన్లు, పోషకాలపై శ్రద్ధ వహించండి. లేదంటే శరీరంలో నొప్పులు పెరుగుతాయని గుర్తుపెట్టుకోండి.




