AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెలలో ఏర్పడనున్న హంస, రుచక రాజయోగం.. నక్క తోక తొక్కే మూడు రాశులు ఇవే…

అక్టోబర్ నెలలో అడుగు పెట్టేశాం,, ఈ నెలలో నవ గ్రహాల్లో అనేక ప్రధాన గ్రహాలు తమ స్థానాన్ని మర్చుకోనున్నాయి. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. ఈ సమయంలో ఈ గ్రహాలు మూడు రకాల రాజ యోగాలను సృష్టిస్తాయి. ఈ యోగాల ప్రభావం మొత్తం 12రాశులపై చూపిస్తాయి. కానీ కొన్ని రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని కలిగిస్తాయి.

Surya Kala
|

Updated on: Oct 01, 2025 | 12:29 PM

Share
అక్టోబర్ ప్రారంభం అయింది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో తమ గమనాన్ని మార్చుకుని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడుతూ ఉంటాయి. ఇలా గ్రహాల గమనం సమయంలో దేశ విదేశాలతో పాటు మొత్తం 12 రాశులకు చెందిన ప్రజలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం అక్టోబర్‌లో అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. మూడు ముఖ్యమైన గ్రహాల రాశి మార్పు వలన రాజయోగాలు ఏర్పడతాయి. కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తాయి.

1 / 5
అక్టోబర్ నెలలో నవ గ్రహ అధినేత సూర్యుడు,గ్రహాల రాకుమారుడు బుధుడు.. రాక్షస గురువు శుక్రుడు తమ రాశిని మార్చుకోనున్నారు. ఈ మూడు గ్రహాల రాశిచక్ర మార్పులు మూడు రకాల రాజయోగాలను సృష్టిస్తాయి. అవి ఆదిత్య మంగళ రాజయోగం, హంస రాజయోగం, రుచక రాజయోగం. ఈ నెలలో ఈ రాజయోగాలు ఏర్పడటం వల్ల.. కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ రోజు అక్టోబర్‌లో అత్యంత ప్రయోజనం పొందే అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

2 / 5
మిథున రాశి: అక్టోబర్ నెల మిథున రాశి వారికి చాలా శుభప్రదమైనది. అదృష్టవంతమైనది. మిథున రాశి వారు అనేక ప్రధాన గ్రహాల సంచారము వలన ఏర్పడిన రాజయోగాలతో ప్రయోజనం పొందుతారు. వీరి జాతకంలో సంపద ఇంట్లో హంస రాజ్యయోగం, ఏడవ ఇంట్లో రుచక రాజ్యయోగం ఏర్పడుతున్నాయి. తత్ఫలితంగా వీరు ఎప్పటికప్పుడు ఆకస్మికంగా ధన లాభాలను పొందుతారు. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అక్టోబర్ కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి.

3 / 5
వృశ్చిక రాశి: అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి ఈ నెలలో ఏర్పడే రాజయోగం వల్ల వృశ్చిక రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్రం  ప్రకారం వీరి జాతకంలో లగ్న ఇంట్లో రుచక రాజ్యయోగం ఏర్పడుతుంది. అయితే ఎనిమిదవ ఇంట్లో హంస రాజ్యయోగం ఏర్పడుతుంది. తత్ఫలితంగా వీరి ఆర్థిక పరిస్థితి గణనీయమైన మెరుగుదలలను చూస్తుంది. ఈ సమయంలో వీరిలో ధైర్యం, శౌర్యం పెరుగుతాయి. ఏదైనా ప్రాజెక్ట్‌లో పనిచేస్తుంటే.. ఈ నెలలో ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారు. సక్సెస్ వీరి సొంతం.

4 / 5
మకర రాశి: అక్టోబర్ నెల మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా, శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఏడవ ఇంట్లో హంస రాజ్యయోగం, 12వ ఇంట్లో రుచక రాజ్యయోగం ఏర్పడుతున్నాయి. తత్ఫలితంగా ఈ సమయంలో మకర రాశి వారు ఆఫీసులో గౌరవాన్ని పొందుతారు. లాభాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగాలు..  మంచి అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. వివాహం ప్రయత్నం చేస్తున్నవారికి ఈ సమయంలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.  శుభవార్త వినవచ్చు.

5 / 5