Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laughing Tree: తాకినా చూసినా ఈ చెట్టు నవ్వుతుంది.. అంతరించుపోతున్న జాతిలో కితకితల చెట్టు.. ఎక్కడుందంటే

Laughing Tree: ప్రకృతి వరం చెట్లు.. ఈ చెట్లు.. మానవమనుగడకు ఆధారం. తినే ఆహారం పండ్లు, పువ్వులు, ఆకులు వేర్లు ఇలా అనేకరకాలుగా ఉపయోగపడతాయి. అయితే ఈ చెట్లు కూడా..

Laughing Tree: తాకినా చూసినా ఈ చెట్టు నవ్వుతుంది.. అంతరించుపోతున్న జాతిలో కితకితల చెట్టు.. ఎక్కడుందంటే
Laughing Tree
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2021 | 11:16 AM

Laughing Tree: ప్రకృతి వరం చెట్లు.. ఈ చెట్లు.. మానవమనుగడకు ఆధారం. తినే ఆహారం పండ్లు, పువ్వులు, ఆకులు వేర్లు ఇలా అనేకరకాలుగా ఉపయోగపడతాయి. అయితే ఈ చెట్లు కూడా మనిషిలా ప్రాణం ఉన్నవి అన్న సంగతి తెలిసిందే. కొన్ని చెట్ల ఆకులు టచ్ నాచ్ మీ అంటూ ముట్టుకుంటే ముడుచుకుంటాయి. ఈ చెట్టుని తెలుగులో అత్తిపత్తి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. అయితే ఇప్పుడు మనం కితకితలు చెట్టు గురించి తెలుసుకుందాం. అవును.. ఈ చెట్లకి మనుషుల్లాగే కితకితలు ఉంటాయట. ఈ చెట్టుని నిమిరినట్టు చేశామనుకోండి కిలకిలా నవ్వుతుంది. అయితే ఇది ఎక్కడుంది? ఇది ఎలా నవ్వగలుగుతుందో తెలుసుకుందాం…

గడ్డి మైదానాల్లో పెరిగే ఈ చెట్టును మొదటిసారిగా శాస్త్రవేత్త జెస్సే బోస్‌ కనిపెట్టారు. ఈ చెట్లు చాలా సున్నితమైనవట. “మనుషుల సైగలను బట్టి కూడా ఈ చెట్లు స్పందిస్తాయి. కానీ మనం ఆ స్పందనలను చూడలేం” అని జెస్సే బోస్ తెలిపినట్లు కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ DFO యశ్వంత్ చెప్పారు. మనుషులు నవ్వినప్పుడు సౌండ్‌ వచ్చినట్లు ఈ చెట్లు నవ్వినప్పుడు సౌండ్‌ రాదు. మనం దానిని తాకినిప్పుడు దానికి కితకితలు వస్తున్నాయి… ప్లీజ్‌ వద్దు.. అన్నట్లుగా ఆ చెట్టు అటూ ఇటూ కదులుతుందట. దాని ఆకులు,కొమ్మలు చిన్నగా కదులుతాయట. ఇదే దాని ప్రత్యేకత. గాలి వీచే సమయంలోనే ఈ చెట్లు ఊగుతాయట. మిగతా సమయాల్లో వాటంతట అవి ఊగవట. అయితే మనం ఈ చెట్టుని నిమిరినప్పుడు చిన్నగా కదులుతుందట.. అదేనండి కితకితలు వస్తాయికదా.. అందుకే కదులుతుంది. అందువల్లే దీన్ని చక్కిలిగింతల చెట్టు అని పిలుస్తున్నారట. ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రండియా డ్యుమెటోరమ్. దీని కాండం నుంచి సెన్సిటివ్ సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయట. అందువల్లే ముట్టుకోగానే కొమ్మలు, ఆకులూ ఊగుతాయట.

ఉత్తరప్రదేశ్‌లో నైనిటాల్ జిల్లాలోని కలదుంగి అడవుల్లోని చెట్టు తాకినప్పుడు, చక్కిలిగింతలు పెట్టినప్పుడు లేదా లాలించేటప్పుడు అసాధారణ ప్రవర్తన కారణంగా పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. స్థానికులు “చెట్టు చక్కిలిగింతలు పెడితే నవ్వుతుంది” అని పేర్కొంటూ దానికి ‘లాఫింగ్ ట్రీ’ అని పేరు పెట్టారు. రాష్ట్రంలో అక్కడక్కడా కనిపించే ఈ చెట్లు అంతరించిపోతున్న చెట్ల జాతుల్లో ఉన్నాయి. ఈ చెట్ల సంఖ్యను పెంచడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా కుదరట్లేదట. ఎన్నోసార్లు ఈ చెట్టు గింజలు, కాండాలను పాతిపెట్టి… కొత్త మొక్కలు వచ్చేలా ప్రయత్నించినా ఫలితం రాలేదట. ఇప్పుడు గ్రాఫ్టింగ్ విధానంలో కొత్త మొక్కలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read:

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లరి పిల్ల అర్హ పుట్టిన రోజు నేడు..

గల గలా మాట్లాడే జలపాతం ఈ యాంకరమ్మ.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.?

ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులమాట..
ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులమాట..
ఉగాది రోజున స్పెషల్ స్నాక్.. కోతిమ్బిర్ వడి రెసిపీ..!
ఉగాది రోజున స్పెషల్ స్నాక్.. కోతిమ్బిర్ వడి రెసిపీ..!
అమేథీలో ఓటమికి కారణం ఇదేః స్మృతి ఇరానీ
అమేథీలో ఓటమికి కారణం ఇదేః స్మృతి ఇరానీ
మార్చి 30న శ్రీ ఆదిశంకర మఠంలో ఉగాది పంచాంగ శ్రవణం
మార్చి 30న శ్రీ ఆదిశంకర మఠంలో ఉగాది పంచాంగ శ్రవణం
మనోజ్‌ బాజ్‌పాయ్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మనోజ్‌ బాజ్‌పాయ్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే.. పిందె కూడా వదిలిపెట్టరండోయ్..
పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే.. పిందె కూడా వదిలిపెట్టరండోయ్..
Team India: రోహిత్ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే..?
Team India: రోహిత్ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే..?
ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల కంటే మనదేశంలో ఎక్కువ బంగారం
ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల కంటే మనదేశంలో ఎక్కువ బంగారం
దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..
దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..
ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్
ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్