Cobra Python Fight video: నాగుపాము, కొండచిలువ మధ్య భీకర యుద్దం.. విన్నర్ ఎవరో తెలియాలంటే వీడియో చూడాల్సిందే..
అనుకోకుండా ఓ ఆరడుగుల నాగు పాము కనిపిస్తే భయంతో పరుగుల తీస్తాం. అలాంటిది ఓ పెద్ద నాగుపాము.. భారీ కొండచిలువతో తలపడుతూ కనిపిస్తే.. ఎలా ఉంటుంది... వెన్నులో వణుకు పుడుతుంది కదూ.. మరి రెండు శక్తివంతమైన ఈ పాములు
అనుకోకుండా ఓ ఆరడుగుల నాగు పాము కనిపిస్తే భయంతో పరుగుల తీస్తాం. అలాంటిది ఓ పెద్ద నాగుపాము.. భారీ కొండచిలువతో తలపడుతూ కనిపిస్తే.. ఎలా ఉంటుంది… వెన్నులో వణుకు పుడుతుంది కదూ.. మరి రెండు శక్తివంతమైన ఈ పాములు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూస్తారు.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇందులో గెలుపెవరిదో కూడా వీడియో చూసాకే తెలుస్తుంది.
ఒక్క నిమిషం 25 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వైరల్ ప్రెస్ తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ పోరాటం సింగపూర్‌లోని బులో వెట్‌ల్యాండ్ రిజర్వ్‌లో జరిగింది. ఈ వీడియోలో ఒకదానికొకటి ఎదురుపడిన కొండచిలువ, నాగుపాము తలపడ్డాయి. బులోహ్ వెట్‌ల్యాండ్ రిజర్వ్ ఉద్యోగులు దీన్ని గుర్తించారు. కొంతసమయం వరకు కొండచిలువ ఆధిపత్యం చెలాయించింది. అయితే నాగుపాము ఏమాత్రం తగ్గకుండా కొండచిలువను మింగే ప్రయత్నం చేసింది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే దృశ్యం. ఎందుకంటే కొండచిలువ చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని నాగుపాము మింగడం అసాధ్యం. కానీ ఇక్కడ నాగుపాము కొండచిలువ కంటే కొంచెం పెద్దగా ఉంది. అది కొండచిలువను సులభంగా అధిగమించేసింది. ఈ వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

