దేశంలో టాప్ స్పాట్ లో ఉత్తరప్రదేశ్.. సీఎం యోగి ఆదిత్యనాథ్ పై హోమ్ మంత్రి అమిత్ షా ప్రశంసల జల్లు
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను హోమ్ మంత్రి అమిత్ షా పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. రాష్టంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముందంజలో ఉందని, శాంతి భద్రతల పరిరక్షణలో...
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను హోమ్ మంత్రి అమిత్ షా పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. రాష్టంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముందంజలో ఉందని, శాంతి భద్రతల పరిరక్షణలో ఈ సర్కార్ కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. ఈ విషయాల్లో దేశంలో యూపీ అన్ని రాష్ట్రాల్లో కెల్లా టాప్ స్పాట్ లో ఉందని ఆయన చెప్పారు. ఆదివారం లక్నోలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ భవనానికి శంకు స్థాపన చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లోగడ ఆరేళ్ళ పాటు తాను ఈ రాష్ట్రంలో పర్యటించానని, నాడు మహిళలకు ఏ మాత్రం భద్రత ఉండేది కాదని, ల్యాండ్ మాఫియా యధేచ్చగా భూకబ్జాలకు పాల్పడేదని, పట్ట పగలే ఘర్షణలు, పేదలపై దాడులు, కాల్పులు జరిగేవని అన్నారు. అయితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేబట్టి శాంతి భద్రతలను కాపాడుతామన్న హామీతో బీజేపీ 2017 లో అధికారంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. అన్నట్టుగానే ఈ రాష్ట్రంలో ఇవి సవ్యంగా అమలు జరుగుతున్నాయన్నారు.
పథకాలను ఎవరైనా ప్రకటించవచ్చునని, కానీ వాటిని సమర్థంగా అమలు చేయాల్సి ఉందని, మధ్య దళారులు లేకుండా చూడడం, వీటి ఫలాలు ప్రజలకు సరిగ్గా అందేలా చూడడం ప్రధానమని అమిత్ షా పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా సక్సెస్ సాధించిందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధమైన పద్దతిని అనుసరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. కాగా- కేంద్రం ఎప్పటికప్పుడు అందజేస్తున్న గ్రాంట్లు, నిధుల వల్ల తాము ఈ పథకాలను సవ్యమైన రీతిలో అమలు చేయగలుగుతున్నామని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : దొరుకుతవా దొర్కవా.. నేను దొర్కా పో..!చిరుతతో ‘కోతి’ కొమ్మచ్చి..వైరల్ వీడియో..:Cheetah vs Monkey Funny video.
ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.