భావ సారూప్యం గల అన్ని చిన్న పార్టీలనూ ఆహ్వానిస్తున్నాం…సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్

వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భావ సారూప్యం గల అన్ని చిన్న పార్టీలను తమతో పొత్తుకు ఆహ్వానిస్తున్నామని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు తామంతా కలిసికట్టుగా పోటీ చేయవలసి...

భావ సారూప్యం గల అన్ని చిన్న పార్టీలనూ ఆహ్వానిస్తున్నాం...సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్
Akhilesh

వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భావ సారూప్యం గల అన్ని చిన్న పార్టీలను తమతో పొత్తుకు ఆహ్వానిస్తున్నామని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు తామంతా కలిసికట్టుగా పోటీ చేయవలసి ఉందని ఆయన చెప్పారు. వివిధ అంశాలపై తమ పార్టీని విమర్శిస్తున్న కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీల వైఖరులేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారి పోరాటం బీజేపీ పైనా లేక మా పార్టీపైనా అని ఆయన ప్రశ్నించారు. మీరు ఎవరి వైపు ఉన్నారు అని ఆయన ఈ రెండు పార్టీలను ఎత్తిపొడిచారు. ఎన్నో చిన్న పార్టీలు ఇప్పటికే తమతో పొత్తు పెట్టుకున్నాయని, మరిన్ని పార్టీలను ముందుకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నామని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వం లోని ఎంఐఎం.. ఓంప్రకాష్ రాజ్ భర్ ఆధ్వర్యంలోని భాగీదారీ మోర్ఛాతో చేతులు కలపడాన్ని ఆయన ప్రస్తావిస్తూ..వారితో తామింకా చర్చలు జరపలేదని తెలిపారు.

తమ పార్టీ సిధ్ధాంత కర్త జనేశ్వర్ మిశ్రా జయంతి రోజైన ఈ నెల 5 న తాము అన్ని జిల్లాల్లో యాత్ర ప్రారంభిస్తున్నామని, బీజేపీ పాలనను ఎండగడుతూ ఈ నెల 15 నుంచి మరిన్ని యాత్రలు చేపడతామని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. అయితే ఇవి బస్సు యాత్రలా పాద యాత్రలా అన్న విషయాన్ని ఆయన వివరించలేదు. పెగాసస్ వివాదాన్ని ప్రస్తావించి.. ఆయన.. ఇది దేశ భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు. బహుజన్ సమాజ్ పార్టీ మాదిరే మేము కూడా వివిధ వర్గాలతో సమ్మేళనాలు నిర్వహిస్తాం అని ఆయన పేర్కొన్నారు. యూపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : దొరుకుతవా దొర్కవా.. నేను దొర్కా పో..!చిరుతతో ‘కోతి’ కొమ్మచ్చి..వైరల్ వీడియో..:Cheetah vs Monkey Funny video.

 రాత్రైతే చాలు రహస్యపూజలు..తెల్లారేసరికి రోడ్లపై భయంకరమైన దృశ్యాలు….కదంభపూర్‌లో అలికిడి:Black Magic Video.

 భారీ వర్షాలు ఆ గ్రామానికి శాపాలుగా మారాయి.. ఎడ్లబండి లోనే ప్రసవించిన మహిళ..:woman gave birth in cart Video.

 ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్‌..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.

Click on your DTH Provider to Add TV9 Telugu