AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad ‘ALAM’: 18 సంవత్సరాల క్రితం చోరీకి గురైన పవిత్ర ‘ఆలం’.. త్వరలో భారత్‌కు అప్పగించనున్న ఆస్ట్రేలియా..

Hyderabad ‘ALAM’: భాగ్యనగరం నుంచి 18 సంవత్సరాల క్రితం చోరీకి గురైన పురాతన పవిత్రమైన అలం(పీర్లు) తిరిగి వచ్చేస్తోంది.

Hyderabad ‘ALAM’: 18 సంవత్సరాల క్రితం చోరీకి గురైన పవిత్ర ‘ఆలం’.. త్వరలో భారత్‌కు అప్పగించనున్న ఆస్ట్రేలియా..
Alam
Shiva Prajapati
|

Updated on: Aug 01, 2021 | 4:06 PM

Share

Hyderabad ‘ALAM’: భాగ్యనగరం నుంచి 18 సంవత్సరాల క్రితం చోరీకి గురైన పురాతన పవిత్రమైన అలం(పీర్లు) తిరిగి వచ్చేస్తోంది. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ఆలం ను ఆదేశ ప్రభుత్వం.. భారతదేశానికి తిరిగి అప్పగించేస్తోంది. ఇదొక్కటే కాదు.. మరో 14 కళాఖండాలను కూడా అప్పగిస్తోంది. 2003, ఏప్రిల్ 11వ తేదీన రాత్రి మీక్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజా ఖానా జెహ్రా దారుషిఫా నుంచి ఈ ఆలం ను దొంగిలించారు. అలా దోపిడీకి గురైన ఆలం ను హైదరాబాద్ పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను కూడా అరెస్ట్ చేశారు. అయితే, ఆధారాలు లభించకపోవడంతో.. కేసు మూసివేశారు.

పంచలోహం, బంగారు పూతతో తయారు చేసిన ఈ ఆలంలో విలువైన రత్నాలను అమర్చారు. అందుకే ఈ ఆలం ను దుండగులు అపహరించారు. ఇలా అపహరణకు గురైన పవిత్ర ఆలం.. స్మగ్లర్ ద్వారా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో దర్శనమిచ్చింది. దీనిపై ఆరా తీయంగా అసలు విషయం తెలిసింది. ఆలం ను దొంగిలించిన దుండగులు.. ఆస్ట్రేలియాకు తరలించారు. అక్కడ పోలీసులకు పట్టుబడటంతో.. దానిని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్రదర్శనకు పెట్టారు. దీని గురించి సమాచారం అందుకున్న భారత ప్రభుత్వం.. ఆస్ట్రేలియాకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఆలంతో పాటు.. దేశానికి చెందిన మరో 14 కళాకృతులను అప్పగించాల్సిందిగా కోరింది. దానికి సానుకూలంగా స్పందించింది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా. భారత్‌కు వీటిని అప్పగిస్తామని ప్రకటించింది.

చివరి నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1956 లో మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా జ్ఞాపకార్థం ఆజా ఖానా జెహ్రాలో ఈ ఆలం ను ఏర్పాటు చేశారు. అయితే, నిజాం తల్లి అమ్తూల్ జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అజా ఖానా జెహ్రా.. చార్మిత్రాత్మక చిహ్నంగా నిలిచింది. దీనిని మదర్-ఇ-డెక్కన్ (మదర్ ఆఫ్ దక్కన్) అని కూడా అంటారు. కర్బాలా యుద్ధంలో ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ ఇబ్న్ అలీ మరణానికి సంతాపం తెలిపేందుకు ఈ స్మారక స్థలాన్ని షియా సంఘం ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఆజా ఖానా నిజాం ట్రస్ట్ నిర్వహణలో ఉంది.

ఇదిలాఉంటే.. ఇండియా కు పవిత్ర అలం తిరిగి వస్తుండడంతో హైద్రాబాద్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, వక్ఫ్ బోర్డ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సఫీవుల్లా.. ఆలం ను తిరిగి ఇవ్వాలనే ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం దాని అసలు స్థానంలో తిరిగి ఇన్‌స్టాల్ చేయడానికి హైదరాబాద్‌కు అప్పగిస్తుందని ఆయన ఆశించారు. ఇండియాకు అలం చేరుకున్న తరవాత.. ఎక్కడ నుండి దొంగిలించబడిందో.. అక్కడే తిరిగి ప్రతిష్టించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు.

Also read:

MLA Seethakka: కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారు.. సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే సీతక్క..

AP Weather Alert: ఏపీలో పడమర గాలుల ఎఫెక్ట్.. రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్..

Telangana Congress: కాంగ్రెస్ లో దళిత దండోరా లొల్లి.. ప్రధాన చర్చ రేవంత్ తీరుపైనే.. ఎందుకంటే..