Telangana Congress: కాంగ్రెస్ లో దళిత దండోరా లొల్లి.. ప్రధాన చర్చ రేవంత్ తీరుపైనే.. ఎందుకంటే..

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్లుంది. ఆధిప‌త్య పోరు షురూ అయ్యింది. ఫలితంగా..

Telangana Congress: కాంగ్రెస్ లో దళిత దండోరా లొల్లి.. ప్రధాన చర్చ రేవంత్ తీరుపైనే.. ఎందుకంటే..
Revanth
Follow us

|

Updated on: Aug 01, 2021 | 4:53 PM

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్లుంది. ఆధిప‌త్య పోరు షురూ అయ్యింది. ఫలితంగా పార్టీలో ఎవ‌రికి వారు య‌మునా తీరే అన్నట్లుగా మారింది. ఎవ‌రికి వారు త‌మ త‌మ ప‌ట్టును నిలుపుకునేందుకు ర‌క‌ర‌కాల ప్రయ‌త్నాలు చేస్తున్నారు. తాజాగా ద‌ళిత గిరిజ‌న దండోరా కార్యక్రమం విష‌యంలో పార్టీలో బేదాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ల మధ్య పోరు తారాస్థాయికి చేరింది.

వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కొత్త టీమ్ వ‌చ్చాక.. పార్టీని గాడిన పెట్టేందుకు కార్యక్రమాల‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టగా.. తాజాగా ద‌ళిత బంధు ప‌థ‌కం విష‌యంలో ప్రభుత్వ లోటుపాట్లపై పోరాటం చేయాల‌ని నిర్ణయించింది. ఈ మేర‌కు ద‌ళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌నే డిమాండ్‌తో ద‌ళిత, గిరిజ‌న ఆత్మగౌరవ దండోరాను ప్రటించింది. ఇందులో భాగంగా ద‌ళిత గిరిజ‌న దండోర పేరుతో ఆగ‌ష్టు 9వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 17వ తేదీ వ‌ర‌కు వివిధ ద‌శ‌ల్లో పోరాటం చేయాల‌ని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమం విషయంలో కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన తమను సంప్రదించకుండా ఏకపక్షంగా సభను ప్రకటించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం నాడు జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఇదే అంశం హాట్ టాఫిక్ గా మారింది.

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో ఇంద్రవెల్లి సభ అంశం.. రేవంత్ వర్సెస్ మహేశ్వర్ రెడ్డి గా మారిందట. ఇద్దరి మధ్య హాట్ హాట్‌గా డిస్కషన్ జరిగిందట. ఇంద్రవెల్లి మారుమూల ప్రాంతంలో ఉంటుంద‌ని, అక్కడ ల‌క్ష మందితో స‌భ అనేది ఎలా సాధ్యమని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారట. వంద‌ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డం క‌ష్టత‌ర‌మ‌ని చెప్పుకొచ్చారట. దీనిపై రేవంత్ కూడా ఘాటుగానే స్పందించారని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా సభను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది ప్రకటించే స్వేచ్ఛ తనకు ఉంటుందని రేవంత్ గట్టిగా చెప్పారట. అంతేకాదు మహేశ్వర్ రెడ్డి ని నిర్మల్ కు మాత్రమే పరిమితం కావాలంటూ సున్నితంగా హెచ్చరించారట. ఇద్దరి మధ్య వివాదం పెద్దది అవుతుండటంతో సీనియర్లు కల్పించుకొని సర్దుబాటు చేశారట. కానీ మీటింగ్ లో రేవంత్ అంత సీరియస్ అవ్వడం తో సీనియర్లు కూడా ఇది మంచి పద్ధతి కాదు అనే ధోరణి లో మాట్లాడుకుతున్నారంట. ఆదిలోనే రేవంత్ తీరు ఇలా ఉటే.. ముందు ముందు ఎలా ఉంటుందో అని చెవులు కొరుక్కుంటున్నారట పార్టీకి చెందిన మిగతా నేతలు.

మొత్తం మీద దళిత దండోరా లొల్లితో కాంగ్రెస్‌లో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్లయ్యింది. ద‌ళిత‌, గిరిజ‌న దండోరాతో అధికార‌ప‌క్షంపై ఒత్తిడి తీసుకొద్దామ‌ని భావించిన కాంగ్రెస్‌కు.. స్వంత పార్టీలోనే ఒత్తిడి పెరిగింది. ఫైన‌ల్‌గా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ పరిస్థితి ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

(అశోక్ భీమనపల్లి, టీవీ9 తెలుగు)

Also read:

Karna-Duryodhana: స్నేహం ఎవరిదీ గొప్పంటే.. మహాభారతంలోని దుర్యోధన, కర్ణుడని చెబుతారు .. ఎందుకో తెలుసా

NagarjunaSagar: సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సీఎం ఆదేశం.. ఈ సాయంత్రం తెరుచుకోనున్న నాగార్జునసాగర్ గేట్లు..

Maoist Encounter: తెలంగాణ – ఛ‌త్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ఓ మావోయిస్టు మృతి..