IRCTC Tour: వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా భాగ్యనగరాన్ని కేవలం రూ. 505 లతో చుట్టేయండి.. వివరాల్లోకి వెళ్తే

IRCTC Tour: భారత దేశం నడిబొడ్డున ఉన్న నగరం హైదరాబాద్. విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు. అందుకనే భాగ్యనగరాన్ని మినీ ఇండియాగా కూడా పిలుస్తారు...

IRCTC Tour: వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా భాగ్యనగరాన్ని కేవలం రూ. 505 లతో చుట్టేయండి.. వివరాల్లోకి వెళ్తే
Hyd Tour
Follow us

|

Updated on: Aug 01, 2021 | 3:05 PM

IRCTC Tour: భారత దేశం నడిబొడ్డున ఉన్న నగరం హైదరాబాద్. విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు. అందుకనే భాగ్యనగరాన్ని మినీ ఇండియాగా కూడా పిలుస్తారు. ఇక్కడ అనేక చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు, పార్కులు వంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ చూడాలని ఆసక్తికల వారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజ్ ని అందిస్తుంది. ఈ ప్యాకేజ్ తో భాగ్యనగరంలోని ప్రముఖ ప్రదేశాలకు చక్కగా చూసేయొచ్చు.. ఇక ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ ప్యాకేజీ పేరుతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ధర సింగిల్ పర్సన్ కు రూ.505 మాత్రమే. ఈ ప్యాకేజీ సోమవారం, శుక్రవారం తప్ప మిగతా ఐదు రోజులు అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుంటే.. ఒక్కరోజులో భాగ్యనగరంలోని చారిత్రక కట్టడాలను ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు టూర్ మొదలవుతుంది. ఈ టూర్ లో ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ ను సందర్శించవచ్చు. టూర్ కంప్లీట్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ వద్ద దింపుతారు. టూర్ లో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు ప్యాకేజీలో కవర్ అవుతాయి.

అయితే వసతి, భోజన సదుపాయం, పర్యాటక ప్రాంతాల దగ్గర ఎంట్రెన్స్ ఫీజులు వంటివి తామే పెట్టుకోవాలి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడచ్చు. 13 నుంచి 22 మంది ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.505 చెల్లించాలి. 7 నుంచి 12 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,145 చెల్లించాలి. అదే ఈ ప్యాకేజీ 4 నుంచి 6 మంది బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,170 చెల్లించాలి.

Also Read:  స్నేహం ఎవరిదీ గొప్పంటే.. మహాభారతంలోని దుర్యోధన, కర్ణుడని చెబుతారు .. ఎందుకో తెలుసా