Karna-Duryodhana: స్నేహం ఎవరిదీ గొప్పంటే.. మహాభారతంలోని దుర్యోధన, కర్ణుడని చెబుతారు .. ఎందుకో తెలుసా

Karna-Duryodhana Friendship : సృష్టిలో ఒక్క స్నేహం తప్ప అన్ని బంధాలను. దేవుడే సృష్టిస్తాడు. కేవలం స్నేహితులను మాత్రం ఎంపికచేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. తప్పు ఒప్పు అనేవి..

Karna-Duryodhana: స్నేహం ఎవరిదీ గొప్పంటే.. మహాభారతంలోని దుర్యోధన, కర్ణుడని చెబుతారు .. ఎందుకో తెలుసా
Karna Duryodhana

Karna-Duryodhana Friendship : సృష్టిలో ఒక్క స్నేహం తప్ప అన్ని బంధాలను. దేవుడే సృష్టిస్తాడు. కేవలం స్నేహితులను మాత్రం ఎంపికచేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. తప్పు ఒప్పు అనేవి అన్ని బంధల్లో ఉంటాయి. తప్పు జీవిత పుస్తకంలో ఒక పేజీ లాంటిది బంధాలు మొత్తం పుస్తకమే అవసరం అనుకుంటే ఆ తప్పు అనే పేజీని చించ్చేయ్యడి. కానీ ఆ ఒక్క పేజీ కొరకు మొత్తం పుస్తకాన్ని పోగొట్టకండి. ఒక్క స్నేహితుడు మోసం చేశాడు అని స్నేహాన్ని తప్పు పట్టకండి స్నేహాన్ని దూరం చేసుకోకండి. స్నేహం గొప్పదనాన్ని.. గొప్ప స్నేహితులు ఎవరు.. స్నేహం ఎవరిదీ గొప్పంటే.. మహాభారతంలోని దుర్యోధన, కర్ణుడని చెబుతారు .. ఎందుకోతెలుసా .. వారిద్దరి మధ్య ఉన్న నమ్మకం.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానం.. రెండు ఉదాహరణలు చెబుతారు.

ఒకసారి.. దుర్యోధనుడి భార్య భానుమతి.. పాచికలు ఆడుతుంటే.. ఒక స్టెప్ రాంగ్ వేయడానికి రెడీ అవుతుంటే.. అదిచూసి కర్ణుడు.. పొరపాటున భానుమతి చేతిని పట్టుకున్నాడట.,. అప్పుడు ఆమె మెడలోని ముత్యాల హారం తెగి పడింది.. అప్పుడు కర్ణుడికి తాను చేసిన పని అర్ధం అయ్యి.. అయ్యో స్నేహితుడి భార్య చేయితాకాను అని ఫీల్ అవుతుంటే.. అది చూసిన దుర్యోధనుడు నేలమీద పడిన ముత్యాలను ఏరి.. స్నేహితుడి చేతిలో పెట్టి.. కర్ణుడిని కౌగిలించుకున్నాడట.. అది కర్ణుడి పై దుర్యోధనుడికి నమ్మకం…
ఇక కర్ణుడి వద్దకు వెళ్లిన కుంతీ.. తన జన్మ రహస్యం చెప్పి.. నీ తమ్ముళ్ల వైపు కి రా.. నీకే రాజుగా పట్టాభిషేకం చేయిస్తా అని కర్ణుడికి చెప్పిందట.. అప్పుడు కర్ణుడు.. తల్లి మాటను కాదని.. స్నేహితుడి వైపే.. నిలబడ్డాడు..ఇక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి శిబిరానికి వచ్చాడు. కర్ణా… అని పిలవగానే కృష్ణుడి గొంతు విని వడివడిగా వచ్చి కర్ణుడు నమస్కరించాడు. ‘కృష్ణా… ఏమిటి ఇంత రాత్రి వేళ ఈ రాక’ అన్నాడు. కర్ణుడికి జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని శ్రీకృష్ణుడు కోరుతాడు. దీనికి కర్ణుడు చిన్నగా నవ్వి కృష్ణా, నేనెవరన్నదీ నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపొందేది పాండవులే. ధర్మం పాండవుల పక్షాన ఉంది కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు. ఆ విషయం నాకూ తెలుసు అన్నాడు.

ఇంత తెలిసినవాడివి పాండవుల పక్షాన ఎందుకు చేరడం లేదని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. అందుకు కర్ణుడు… దుర్యోధనుడు నన్ను నమ్ముకునే పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నన్ను నమ్మిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితునిగా నేను ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. తన జన్మ గురించి తెలిసినా, స్నేహితుడిని విడిచి వెళ్లక అతడికి ధైర్యం నూరిపోసిన ధీశాలి కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం అతడు. కౌరవులవైపున్న మంచివాడు కర్ణుడు. తన గౌరవం కోసం, గుర్తింపు కోసం తపన పడిన యోధుడు. దుర్యోధనుడు దుర్మార్గుడని తెలిసి కూడా కేవలం స్నేహం కోసం అతని వైపే పోరాడి అకారణంగా ప్రాణాలు కోల్పోయిన మంచి మిత్రుడు. మహాభారతంలో అర్జునుడిని ఓడించగల శక్తియుక్తులున్న వీరుడు. స్నేహితుడి కోసం పోరాడి.. తన ప్రాణాలు పోగొట్టుకున్న ధీశాలి. కురుక్షేత్రంలో తన తమ్ముళ్లు, చుట్టాలు, ఇలా ఎంతో మరణం చూసినా చలించని దుర్యోధనుడు .. స్నేహితుడి మరణం తో విరక్తి చెందాడు.. అది గా స్నేహం అంటే. అందుకే అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే మాట స్నేహం. స్నేహం అనేది. ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. స్నేహం అద్భుతమైంది. స్నేహానికి ఎల్లలు లేవు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. కనుక స్నేహితులు కర్ణుడు దుర్యోధనుడిలా ఉండాలని కోరుకుంటారు.

Also Read: వైభవంగా హైదరాబాద్ బోనాలు.. మ‌హంకాళి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

Click on your DTH Provider to Add TV9 Telugu