AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laldarwaja Bonalu: బోనాలతో సందడిగా మారిన భాగ్యనగరం.. సింహవాహినిగా లాల్‌ దర్వాజా అమ్మవారు..

హైదరాబాద్‌ బోనమెత్తింది. గ్రేటర్‌లోని అమ్మవారి ఆలయాలు ముస్తాబు అయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. గోల్కొండ, సికింద్రాబాద్‌ బోనాల తర్వాత పాతబస్తీతో పాటు

Laldarwaja Bonalu: బోనాలతో సందడిగా మారిన భాగ్యనగరం.. సింహవాహినిగా లాల్‌ దర్వాజా అమ్మవారు..
Sanjay Kasula
|

Updated on: Aug 01, 2021 | 9:04 AM

Share

హైదరాబాద్‌ బోనమెత్తింది. గ్రేటర్‌లోని అమ్మవారి ఆలయాలు ముస్తాబు అయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. గోల్కొండ, సికింద్రాబాద్‌ బోనాల తర్వాత పాతబస్తీతో పాటు కొన్ని చోట్ల బోనాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో చాలా వరకు శ్రావణమాసంలో బోనాల వేడుకలు జరుగుతాయి. ఒక్కో ఆదవారం ఒక్కో ప్రాంతంలో వేడుకలు నిర్వహిస్తారు. కానీ ఈ చివరి ఆదివారం మాత్రం హైదరాబాద్ అంతా ఒకే రోజు బోనాలు ఉత్సవం నిర్వహిస్తున్నారు.

లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి జాతరతో పాటు మేడ్చల్‌,రంగారెడ్డి జిల్లాలోని అన్ని చోట్ల వేడుకలు జరుగుతున్నాయి. సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆషాఢ మాసంలో జరిగే చివరి బోనాలు కావడంతో ఓల్డ్ సిటీ ప్రాంతం కళకళలాడుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఈ రోజు బోనాలు జరగనున్నాయి.

లాల్‌దర్వాజ భక్తులతో సందడిగా సందడిగా మారాయి. రంగం కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పక్కాగా ఏర్పాట్లు చేశారు. సింహవాహిని అమ్మవారికి ముందుగా ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు.

మరోవైపు బోనాల సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌ నగరంలో జరిగే లాల్‌దర్వాజా బోనాలకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.

పాతబస్తీలోని పలు బస్తీల నుంచి బోనాల ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి చేరుకుంటుందని.. రంగం, పోతురాజు ప్రవేశం కూడా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి: Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం..హుజురాబాద్‌ ఉప ఎన్నికపైనా ఫోకస్.. దళిత బంధు.. 50 వేల ఉద్యోగాలపై చర్చ

Chanakya Niti: ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు.. చాణక్యుడు చెప్పిన పెద్ద రహస్యం

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..