Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం..హుజురాబాద్‌ ఉప ఎన్నికపైనా ఫోకస్.. దళిత బంధు.. 50 వేల ఉద్యోగాలపై చర్చ

Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి KCR అధ్యక్షతన  ఆదివారం(ఆగస్టు ఒకటి)నాడు మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు

Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం..హుజురాబాద్‌ ఉప ఎన్నికపైనా ఫోకస్.. దళిత బంధు.. 50 వేల ఉద్యోగాలపై చర్చ
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 01, 2021 | 8:15 AM

Telangana Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి KCR అధ్యక్షతన  ఆదివారం(ఆగస్టు ఒకటి)నాడు మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, జులైలో రెండు సార్లు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. జూలై 6న మంత్రి వర్గం సమావేశం కాగా.. జూలై 13న కొనసాగిన సమావేశం ఏకంగా రెండు రోజుల పాటు కొనసాగింది. ఈ సమావేశాల్లో రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే.. ఆ తర్వాత ఇవాళ మరోసారి కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో దళిత బంధు అమలుతోపాటు ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి గత కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకున్నా…దాని అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఎమ్మెల్యేకు నిరసన వ్యక్తమవుతోంది. ఆయా నియోజకవర్గాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలోనే ఆదివారం జరగబోయే సమావేశంలో మరోసారి ఈ పథకంపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి మహాయజ్ఞం ఆగబోదని CM KCR ప్రకటించారు. ఆరు నూరైనా దళితబంధు అమలు చేసి తీరతామన్నారు. రైతు బీమా తరహాలోనే చేనేతలకు, దళితులకు బీమాను అందిస్తామన్నారు. పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఇప్పటికే చేనేతలకు బీమాపై CM KCR ప్రకటించిన నేపథ్యంలోనే దానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యే కోటా ఆరుగురు MLCల ఎంపిక జరుగనున్న నేపథ్యంలో మరిన్ని కీలక అంశాలపై రాష్ట్ర మంత్రి మండలి చర్చించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి: Secunderabad: రైలు ఎక్కబోతూ జారిపడ్డ మహిళ.. చాకచక్యంగా ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన RPF కానిస్టేబుల్

Infinix X1: మరో స్మార్ట్ టీవీని విడుదల చేసిన హాంకాంగ్ కంపెనీ.. అదిరిపోయే ధర.. అద్భుత ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..