Secunderabad: రైలు ఎక్కబోతూ జారిపడ్డ మహిళ.. చాకచక్యంగా ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన RPF కానిస్టేబుల్
రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సమయానికి స్పందించి ఓ మహిళ ప్రాణాల్ని కాపాడారు. దీంతో ఒక్కసారిగా అతడు హీరోగా మారిపోయాడు.
RPF Constable saves woman life: రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సమయానికి స్పందించి ఓ మహిళ ప్రాణాల్ని కాపాడారు. దీంతో ఒక్కసారిగా అతడు హీరోగా మారిపోయాడు. దక్షిణ మధ్య రైల్వే మండల విభాగం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైతు ఎక్కోబోతుండగా జారి కిందపడింది. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్రమత్తమై ఆ మహిళ ప్రాణాలు కాపాడాడు. నసీమా బేగం అనే మహిళ కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి అదుపు తప్పి.. ప్లాట్‌ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది.
ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ సదరు కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అయితే, ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ దినేష్ సింగ్‌పై ఉన్నతాధికారులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఇదే సమయంలో రైలులో ఉన్న వ్యక్తి చైను లాగాడు.. దీంతో రైలు కాసేపు నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. జరిగిన ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Timely & Daring #LifeSaving act by RPF staff
Aged woman passenger tried to board moving train at Secuderabad stn fell in the gap btwn coach & platform and was being dangerously dragged. On duty RPF constable Sri.Dinesh Singh acted immediately, pulled lady out & saved her life. pic.twitter.com/Me4z0SA7ZW
— South Central Railway (@SCRailwayIndia) July 31, 2021
Read Also…