AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sexual Harassment: ఉద్యోగం శానిటరీ ఇన్‌స్పెక్టర్. ప్రవృత్తి పని మీద వచ్చిన మహిళల్ని లైంగికంగా వేధించడం.. చివరికి ఫిల్మ్ కాలిపోయింది

ఉద్యోగం శానిటరీ ఇన్‌స్పెక్టర్. ప్రవృత్తి పని మీద వచ్చిన మహిళల్ని వేధించడం. ఇదీ.. సర్కారుగిరి వెళగబెడుతోన్న సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాగోతం...

Sexual Harassment: ఉద్యోగం శానిటరీ ఇన్‌స్పెక్టర్. ప్రవృత్తి  పని మీద వచ్చిన మహిళల్ని లైంగికంగా వేధించడం.. చివరికి ఫిల్మ్ కాలిపోయింది
Sexual Harassment
Venkata Narayana
|

Updated on: Jul 31, 2021 | 5:36 PM

Share

Sadasivpet Sanitary Inspector Sexual Harassment: ఉద్యోగం శానిటరీ ఇన్‌స్పెక్టర్. ప్రవృత్తి పని మీద వచ్చిన మహిళల్ని వేధించడం. ఇదీ.. సర్కారుగిరి వెళగబెడుతోన్న సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాగోతం. ఇన్నాళ్లు అతని ఆట సాగింది. ఇప్పుడు సీన్ ఫుల్ రివర్స్ అయిపోయి ఫిల్మ్ కాలిపోయింది.

హైదరాబాద్ శివారు సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో పని మీద వచ్చిన మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని శానిటరీ ఇన్స్పెక్టర్‌కు వెంకన్న అనే ఒక భర్త దేహశుద్ధి చేశారు.  అంతేకాదు, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కీచక ప్రభుత్వాధికారిని పోలీసులకు అప్పగించారు.

ఇంతకాలం సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ సమయం దొరకితే కామకళ్లు తెరిచే సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్న పరిస్థితి. కామాంధులూ ఖబడ్దార్. రోజులు మారాయి. మీ ఆటలిక సాగవు.

Read also: Chandrababu: చంద్రబాబు వాళ్లపై పాములా పగబట్టారు : మూకుమ్మడిగా విరుచుకుపడ్డ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు