Chandrababu: చంద్రబాబు వాళ్లపై పాములా పగబట్టారు : మూకుమ్మడిగా విరుచుకుపడ్డ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Jul 31, 2021 | 4:27 PM

పాము పగబట్టినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు దళితులపై పగబట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు..

Chandrababu: చంద్రబాబు వాళ్లపై పాములా పగబట్టారు : మూకుమ్మడిగా విరుచుకుపడ్డ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
Chandrababu Naidu

YSRCP Leaders – Chandrababu – Devineni Uma: పాము పగబట్టినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు దళితులపై పగబట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు..? అని ప్రశ్నించిన వైసీపీ నేతలు.. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై టీడీపీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు.

చంద్రబాబు దళిత ద్రోహి అని మరోసారి నిరూపించుకున్నారని నందిగం సురేష్ విమర్శించారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నేత దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడం దుర్మార్గమని నందిగం అన్నారు. దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమా ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు..? అంటూ వైసీపీ నేతలు ప్రశ్నించారు.

అటు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ కూడా  చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదని, కొంచెం కూడా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదని జోగి ధ్వజమెత్తారు. గొల్లపూడిలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే చంద్రబాబు వచ్చారని, పరామర్శ పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఆయన మండిపడ్డారు. “మైనింగ్‌పై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీతో మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా..?” అని జోగి రమేష్ టీడీపీని ప్రశ్నించారు. మైనింగ్‌లో దోచుకుంది ఎవరో మొత్తం తేలుస్తామని జోగి శపథం చేశారు.

Read also: Chandanagar: చందానగర్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై అటాక్ కేసు: వాటర్ కావాలంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఘటనలో అసలు కథ.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu