AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandanagar: చందానగర్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై అటాక్ కేసు: వాటర్ కావాలంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఘటనలో అసలు కథ.!

హైదరాబాద్ చందానగర్లో నివసించే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటికి వచ్చి మంచినీళ్లు ఇవ్వండంటూ లోనికి ప్రవేశించి అటాక్ చేసిన కేసులో బాధితుడు శ్రీహర్ష టీవీ9 ముందుకొచ్చారు...

Chandanagar: చందానగర్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై అటాక్ కేసు:  వాటర్ కావాలంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఘటనలో అసలు కథ.!
Chandanagar T
Venkata Narayana
|

Updated on: Jul 31, 2021 | 3:56 PM

Share

Chandanagar – Software Employee – Victim Sriharsha: హైదరాబాద్ చందానగర్లో నివసించే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటికి వచ్చి మంచినీళ్లు ఇవ్వండంటూ లోనికి ప్రవేశించి అటాక్ చేసిన కేసులో బాధితుడు శ్రీహర్ష టీవీ9 ముందుకొచ్చారు. రాత్రి జరిగిన ఘటనను వివరించారు. “తన రూమ్మేట్‌ను కలువడానికి వచ్చామంటూ ఇంట్లోకి ఇద్దరు వచ్చారు. నేను కిచెన్ లోకి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాను. వెనుక నుండి వచ్చిన ఇద్దరు.. దాడి చేసి తలను బలంగా గోడకు కొట్టారు. కిందపడి పోవడంతో నా పైన కూర్చొని నా చేతులను వెనుకకి కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కి గదిలోకి తీసుకెళ్ళి కట్టేశారు. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు, డబ్బులను తీసుకెళ్ళారు. కొద్దిసేపటి తరువాత నా ఫ్రెండ్ సాయిరాం వచ్చాడు. డోర్ తీయకపోవడంతో వెనుక డోర్ నుండి వచ్చి కట్టేసిన నా కట్లను విప్పాడు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశాము. స్థానికంగా సౌరభ్ అనే వ్యక్తితో ఈ నెల 15న చిన్న గొడవ జరిగింది. అతనే ఈ పని చేపించాడేమోనని మాకు అనుమానం.” అని బాధితుడు శ్రీహర్ష టీవీ9 కు వెల్లడించారు.

ఇలాఉండగా, హైదరాబాద్ చందానగర్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరు దుండగులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మంచినీళ్లు కావాలంటూ ఇంట్లోకి ప్రవేశించి అరాచకం చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో ఈ ఘటన జరిగింది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీహర్ష ఇంట్లోకి చొరబడి అతనిపై దాడి చేసి, చైర్‌లో కట్టిపడేసి, నోట్లో గుడ్డలు కుక్కి, ఇంట్లో ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు దొచుకెళ్ళారు దుండగులు. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించి పరారయ్యారు. అనంతరం బాధితుడు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read also : Flower Never die: వికసించిన పువ్వు ఎల్లకాలం అలానే.. అదే అందంతో ఉంటే..! ఇలా చేస్తే సరి.!