AP Corona Cases: ఏపీలో స్థిరంగా పాజిటివ్ కేసులు.. దడ పుట్టిస్తున్న ‘డెల్టా’.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు..!

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jul 31, 2021 | 5:36 PM

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా కరోనా కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో..

AP Corona Cases: ఏపీలో స్థిరంగా పాజిటివ్ కేసులు.. దడ పుట్టిస్తున్న ‘డెల్టా’.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు..!
Corona

Follow us on

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా కరోనా కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,992 సాంపిల్స్ పరీక్షించిన వైద్యులు.. 2,058 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. కాగా, నిన్నటి కంటే ఇవాళ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం నాడు 2,068 నమోదవగా.. ఇవాళ 10 తక్కువగా 2,058 పాజిటివ్‌ తేలాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 364 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,66,175 మంది కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా గడిచిన ఒక్క రోజులో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా రికవరీల సంఖ్య 19,31,618 లకు చేరింది.

చిత్తూరు జిల్లాలో అత్యధిక మరణాలు.. కరోనా మహమ్మారి కారణంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,377 లకు చేరింది. ఇక ఇవాళ నమోదైన మరణాల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు చనిపోయారు. ఆ తరువాత కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గుు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ ఎంతంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 2.6 శాతం ఉంది. మరణాల శాతం 0.68% గా ఉండగా.. రికవరీ రేటు 98.2% శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో దాదాపు చాలా మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. కొందరు మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. అనంతపురం – 47, చిత్తూరు – 284, తూర్పు గోదావరి – 364, గుంటూరు – 182, కడప – 140, కృష్ణా – 325, కర్నూలు – 11, నెల్లూరు – 173, ప్రకాశం 242, శ్రీకాకుళం – 45, విశాఖపట్నం 89, విజయనగరం – 29, పశ్చిమ గోదావరి – 127 చొప్పున జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

రెండు నెలల వ్యవధిలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో ఏకంగా 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో అలర్ట్ అయిన ప్రభుత్వం.. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంది. లాక్‌డౌన్ విధించి.. పటిష్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం చేపట్టి ఫలితాలు చివరికి సత్ఫలితాలు ఇచ్చాయి. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జూన్ 1వ తేదీన 11,303 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. జూలై నెలకు వచ్చేసరికి భారీగా తగ్గాయి. జులై 1వ తేదీన 3,841 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలా క్రమంగా తగ్గుకుంటూ వచ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య.. గత రెండు రోజులుగా 2,000 లకు అటూ ఇటుగా నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీలో 2,058 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే.. మే నెల, జులై నెల మధ్య నమోదైన కేసుల మధ్య వ్యత్యాసం దాదాపు 23 వేల వరకు ఉండటం విశేషం.

డెల్టా వైరస్ అలర్ట్.. కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రస్తుతం డెల్టా వేరియంట్ కలవర పెడుతోంది. ఇప్పటికే ఏపీలో రెండు డెల్టా వేరియంట్ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. కరోనా డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హితవుచెప్పింది. ఒకవేళ ఏదైనా అత్యవసర పనిమీద బయటకు వెళ్లినట్లయితే.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Also read:

Kondapalli Mining: తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలని చూస్తున్నారు.. సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు

Independence Day: తీవ్ర విషాదం.. భగత్ సింగ్‌లా నటిస్తూ ఉరికొయ్యకు బలైన చిన్నారి..

Andhra Pradesh: చేసిందంతా వారే.. చంద్రబాబు, దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu