Ashok Babu: ఏపీలో మైనింగ్ మాఫియా విషయంలో వైసీపీకి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ మాఫియా ఏస్థాయిలో విరుచుకుపడుతోందో చెప్పడానికి ఎన్జీటీ తీర్పే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు...
AP Mining – TDP – YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ మాఫియా ఏస్థాయిలో విరుచుకుపడుతోందో చెప్పడానికి ఎన్జీటీ తీర్పే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. విశాఖ మన్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్జీటీ కోరిందని ఆయన గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ నివేదికతో పాటు, ఐదుగురు సభ్యులను నియమించి, వారి నివేదిక కూడా కోరిన విషయాన్ని అశోక్ బాబు ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.
కృష్ణాజిల్లా కొండపల్లి మైనింగ్ ప్రాంతానికి టీడీపీ వారిని వెళ్లకుండా ఈ రోజు అడ్డుకున్న ప్రభుత్వం, భవిష్యత్ లో ఎలా అడ్డుకుంటుందో చూస్తామని ఎమ్మెల్సీ అశోక్ బాబు వైపీపీ నేతలకు సవాల్ విసిరారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించయినా సరే రాష్ట్రంలోని మైనింగ్ మాఫియా ఆటకట్టిస్తామని ఆయన హెచ్చరించారు. మైనింగ్ మాఫియా ఆగడాలు, దుశ్చర్యలపై కేంద్రానికి, ఎన్జీటీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని అశోక్ బాబు వెల్లడించారు.
ఇలా ఉండగా, మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్యని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ వాళ్లే దాడులు చేసి.. రివర్స్ కేసులు పెట్టారని బాబు మండిపడ్డారు. కొండపల్లి మైనింగ్ వ్యవహారం నేపథ్యంలో అరెస్టైన దేవినేని ఉమామహేశ్వరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు శనివారం నాడు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.
చంద్రబాబు వెంట ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బచ్చుల అర్చునుడు, వైవిబి రాజేంద్రప్రసాద్, పట్టాభి వెళ్లారు. కాగా, చంద్రబాబు రాకతో.. ఉమ ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. చంద్రబాబు రాకమీదే ఇప్పుడు వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మూకుమ్మడి విమర్శల దాడి చేస్తున్నారు.
Read also: Chandrababu: చంద్రబాబు వాళ్లపై పాములా పగబట్టారు : మూకుమ్మడిగా విరుచుకుపడ్డ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు