Independence Day: తీవ్ర విషాదం.. భగత్ సింగ్‌లా నటిస్తూ ఉరికొయ్యకు బలైన చిన్నారి..

Independence Day: మరో పదిహేను రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా స్కూళ్లలో...

Independence Day: తీవ్ర విషాదం.. భగత్ సింగ్‌లా నటిస్తూ ఉరికొయ్యకు బలైన చిన్నారి..
Bhagat Singh
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 31, 2021 | 4:11 PM

Independence Day: మరో పదిహేను రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా స్కూళ్లలో విద్యార్థులు రకరకాల నాటకాలు, ప్రదర్శనలు చేస్తుంటారు. ముఖ్యంగా స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలకు సంబంధించిన నాకట ప్రదర్శనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం విప్లవ యోధుడు భగత్ సింగ్ నాటకం రిహార్సల్స్‌ చేస్తూ ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని బుదౌన జిల్లాలోని బబత్‌లో ఓ పాఠశాల ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భగత్ సింగ్ జీవిత కథ ఆధారంగా నాటకం ప్రదర్శన చేయాలని పలువురు విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ పాత్రల్లో ఒకడిగా విద్యార్థి శివమ్(9) నటించేందుకు ముందుకు వచ్చాడు. అయితే, స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలు సమీపిస్తుండటంతో వీరంతా రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భగత్ సింగ్ ఉరితీతను అనుకరించబోయాడు శివమ్. స్టూల్ ఎక్కి మెడకు ఉరి వేసుకున్నాడు శివమ్. దురదృష్టవశాత్తు కాళ్లు జారడంతో శివమ్ మెడకు ఉరి బిగుసుకుపోయింది. దాంతో అతను గిలగిలా కొట్టుకున్నాడు. అది గమనించిన శివమ్ మిత్రులు.. నటిస్తున్నాడని భావించారు. కానీ, ఊపిరి ఆడక శివమ్ ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి కదలికలు లేకపోవడంతో భయపడ్డ మిత్రులు.. వెంటనే చుట్టుపక్కన వారికి సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి శివమ్ ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. భగత్ సింగ్ వద్దకే వెళ్లావాంటూ కన్నీరు మున్నీరు అయ్యారు.

Also read:

Tokyo Olympics 2020 Live Updates: స్టార్ షట్లర్ తై జూ యింగ్‌తో తలపడుతున్న పీవీ సింధు

Priyamani: ‘నారప్ప’ సినిమాతో నా కోరిక నెరవేరింది.. నా ఫోటో కూడా అక్కడ ఉండాలి.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..

Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ.. పుల్వామా దాడికి పాల్పడ్డ టెర్రరిస్ట్ హతం

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!