Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ.. పుల్వామా దాడికి పాల్పడ్డ టెర్రరిస్ట్ హతం
జమ్మూ కాశ్మీర్‌లో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
Jammu Kashmir Pulwama Encounter: జమ్మూ కాశ్మీర్‌లో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోని ఆటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నాగ్‌బెరన్ – తార్సర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులు తుదమట్టించాయి. అటవీప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కశ్మీర్ జోన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, పుల్వామా శివార్లలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకుంది. దీంతో భద్రతా దళాలు ఈ ఉదయం దక్షిణ కాశ్మీర్‌లోని నాగ్‌బెరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. బలగాలు జరిపిన సెర్చ్‌ను పసిగట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
IGP కాశ్మీర్ విజయ్ కుమార్ దీని స్పందిస్తూ.. “నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఇ-మహ్మద్ (జేఈఎం) లంబూతో సంబంధం ఉన్న అత్యున్నత పాకిస్థానీ తీవ్రవాది ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. రెండో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉంది” అని అన్నారు. కాగా, మొహమ్మద్ ఇస్మాల్ అల్వి అలియాస్ లాంబూ అలియాస్ అద్నాన్ మసూద్ అజహర్ కుటుంబానికి చెందినవాడు. అతను లెత్పోరా దాడి కుట్ర ప్రణాళికలో పాల్గొన్నాడు. ఫిదయీన్ దాడి జరిగిన రోజు వరకు అతను ఆదిల్ దార్‌తోనే ఉన్నాడు. అదిల్ దార్ వైరల్ వీడియోలో అతని వాయిస్ ఉందని ఐజిపి కశ్మీర్ అన్నారు. పుల్వామా దాడి కుట్రకు సంబంధించి NIA రూపొందించిన ఛార్జిషీట్‌లో ఆయన పేరు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల బాంబు దాడిలో ఒక జూనియర్ ఆఫీసర్‌తో సహా నలుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు, ఒక పౌరుడు గాయపడిన మరుసటి రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. బారాముల్లా పట్టణంలోని ఖాన్‌పోరా ప్రాంతంలోని సిఆర్‌పిఎఫ్ పార్టీపై ఉగ్రవాదులు ఈ రోజు గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.”ఈ గ్రెనేడ్ పేలుడులో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు జవాన్లతో సహా నలుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఒక పౌరుడు కూడా గాయపడ్డాడు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు” అని పోలీసులు తెలిపారు.
#NewsAlert | Encounter underway in Pulwama district of Jammu and Kashmir. Security Forces target terrorists in Nagberan-Tarsar forest area.
Pradeep Dutta with analysis. pic.twitter.com/tcPs23XNLj
— TIMES NOW (@TimesNow) July 31, 2021
Read Also…