Priyamani: ‘నారప్ప’ సినిమాతో నా కోరిక నెరవేరింది.. నా ఫోటో కూడా అక్కడ ఉండాలి.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 31, 2021 | 3:30 PM

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది.

Priyamani: 'నారప్ప' సినిమాతో నా కోరిక నెరవేరింది.. నా ఫోటో కూడా అక్కడ ఉండాలి.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..
Priyamani

Follow us on

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది. జూలై 20న అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ మూవీకి విశేషాదరణ లభిస్తోంది. మలయాళ సినిమా అసురన్ రీమేక్‏గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో వెంకటేష్ భార్యగా ప్రియమణి హీరోయిన్‏గా నటించింది. ఇదిలా ఉంటే.. నిన్న హైదరాబాద్‏లో నారప్ప సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో ప్రియమణి మాట్లాడుతూ.. నా కెరీర్ ప్రారంభంలో పెళ్లైన కొత్తలో సినిమా చేశాను. ఆ మూవీ షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుండేది. ఆ సమయంలో స్టూడియోలో చాలా మంది హీరోయిన్స్ ఫోటోలను చూశాను. ఎందుకు హీరోయిన్స్ ఫోటోస్ పెట్టారు అని అడిగితే.. సురేశ్ ప్రొడక్షన్స్ లో నటించిన హీరోయిన్ల ఫొటోలు అలా పెడతారని చెప్పారు. అప్పుడే అనుకున్నాను… ఎలాగైనా అక్కడ నా ఫోటో ఉండాలి.

ఎప్పటికైనా సురేశ్ ప్రొడక్షన్స్ లో చేయాలి. నేను అక్కడ నా ఫోటో చూసుకోవాలి అనుకున్నాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. ఇప్పటికీ సురేశ్ ప్రొడక్షన్స్ లో నారప్ప సినిమా చేయగలిగాను. కానీ ఇప్పుడు నా ఫోటో అక్కడ ఉంటుందో లేదో తెలియదు కానీ.. ఆ మాత్రం నెరవేరింది అని చెప్పుకొచ్చారు. అలాగే సినిమా విషయంలో సురేష్ బాబు ఎంత కేర్ తీసుకుంటారో ప్రత్యక్షంగా చూశాను. అలాగే శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్‏లో మొదటి సారి నటించాను. లుక్ టెస్ట్ చేసిన తరువాత ఈ పాత్ర మీరే చేస్తారు అని ఆయన చెప్పగానే నాకు చాలా సంతోషం కలిగింది అని తెలిపారు. ఇక వెంకటేష్ గారితో సినిమా చేయాలని ఉండేది. ఆ ఆశ కూడా ఇప్పుడు నారప్ప సినిమాతో నెరవేరింది అంటూ చెప్పుకొచ్చారు ప్రియమణి..

Also Read: Childhood Photo: నేను ధరించే దుస్తులు రేపు నా పిల్లలు చూసేలా ఉండాలి అన్న హీరోయిన్ చిన్ననాటి ఫోటో

దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు.. చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu