దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు.. చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు.

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 31, 2021 | 1:29 PM

దర్శక దిగ్గజం, దివంగత దాసరి నారాయణరావు కుమారులపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. చేసిన అప్పు తీర్చమన్నందుకు తనను  దాసరి కుమారులు చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు.. చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు.
Dasari

Dasari Narayana Rao’s Sons : దర్శక దిగ్గజం, దివంగత దాసరి నారాయణరావు కుమారులపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. చేసిన అప్పు తీర్చమన్నందుకు తనను  దాసరి కుమారులు చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాసరి ఆర్ధిక పరిస్థితి బాలేని సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు పలు దఫాలుగా రూ.2.10 కోట్లు అప్పుగా ఇచ్చారట. ఆతర్వాత హఠాత్తుగా దాసరి మరణించడంతో పెద్దల సమక్షంలో ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్ 2018 నవంబరు 13న రూ.2.10 కోట్ల బదులు రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారని, ఇప్పుడు ఆడబ్బు అడుగుతుంటే బెదిరిస్తున్నారని సోమశేఖర్ రావు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి నివాసానికి వెళ్లి ప్రభు. అరున్ ని డబ్బులు ఇవ్వమని అడిగగా వారు చంపేస్తామంటూ బెదిరింపులు చేశారని సోమశేఖర్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దాసరి నారాయణరావు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గతంలో దాసరి చనిపోయిన తర్వాత అన్నదమ్ముల మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ విడదల నేపథ్యంలో వారు పలుసార్లు పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లారు. అలాగే దాసరి పెద్ద కుమారుడు ప్రభు ఆమధ్య అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక

Shilpa Shetty: మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. వాటిని నిరోధించండి.. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టి పిటిషన్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu