Throwback Pic : ఫొటోలో కనిపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న బ్యూటీ.. ఎవరో కనిపెట్టగలరా..?
హీరోయిన్స్ కు సంబంధించిన అందమైన ఫోటోలను అభిమానులు పదిలంగా దాచుకుంటూ ఉంటారు. హీరోయిన్ల గ్లామరస్ పిక్స్‌నే కాదు చిన్ననాటి అరుదైన ఫోటోలను కూడా సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ...
హీరోయిన్స్ కు సంబంధించిన అందమైన ఫోటోలను అభిమానులు పదిలంగా దాచుకుంటూ ఉంటారు. హీరోయిన్ల గ్లామరస్ పిక్స్‌నే కాదు చిన్ననాటి అరుదైన ఫోటోలను కూడా సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ ఫోటోను అభిమానులంతా తెగ షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్. యంగ్ హీరోలందరికీ ఈ అమ్మడే ఫిస్ట్ ఛాయిస్. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్‌ను.. భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. తెలుగు- హిందీ భాషల్లో నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకు ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తన తమ్ముడితో ఆటలాడుతో నవ్వుతూ ఫోటోకి ఫోజ్ ఇచ్చిన ఈ చిన్నది ఎవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అంతే కాదు నేడు ఈ వయ్యారి బర్త్ డే కూడా..
తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కియారా. ఆతర్వాత వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దాంతో కియారా అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. క్రేజీ క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. క్రమంలోనే శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది ఈ బ్యూటీ.