AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. వాటిని నిరోధించండి.. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టి పిటిషన్

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసి షాకిచ్చింది.

Shilpa Shetty:  మా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. వాటిని నిరోధించండి.. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టి పిటిషన్
Shilpa Shetty And Raj Kundra
Venkata Chari
|

Updated on: Jul 31, 2021 | 9:29 AM

Share

Shilpa Shetty: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసి షాకిచ్చింది. తనకు, తన భర్త ప్రతిష్టకు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో భంగం కలిగించేలా కథనాలు ప్రచురిస్తున్నాయంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన ఫొటోలు, వీడియోలు వాడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కింది. జాతీయ మీడియాతోపాటు పలువురు జర్నలిస్టులపై కూడా పరువునష్టం దావా వేసింది. ఈ వ్యవహారంలో శిల్పాశెట్టి పాత్ర ఉందంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, పరువునష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.

పోర్న్ కేసులో శిల్పా శెట్టి భర్తను అరెస్ట్‌ చేయడంతో బాలీవుడ్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. కొందరు మహిళలను భయపెట్టి పోర్న్ చిత్రాలను తీసి, వాటిని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు పోలీసులు రాజ్‌కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జులై 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న రాజ్ కుంద్రా.. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఇలాంటి సమాచారం ప్రచురించకుండా మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిరోధించాలని పిటిషన్‌లో కోరింది. కాగా, ముంబై హైకోర్టు ఆయా ప్లాట్‌ఫాంలను నిరోధించేందుకు నిరాకరించింది. అయితే శిల్పా శెట్టి పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారని, సెలబ్రెటీ అయిన వారిపై ఇలాంటి కథనాలు ప్రచురించ కూడదని ఆమె తరుపున హాజరైన లాయర్ బిరెన్ సారాఫ్ కోర్టుకు విన్నవించాడు. ఈమేరకు కోర్టు మేం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేదా మీడియాలో ఇలాంటి కథనాలపై ఎలాంటి ప్రకటన జారీ చేయడం లేదని బదులిచ్చినట్లు సమాచారం. అయితే, శిల్పాశెట్టి కోర్టును ఆశ్రయించడంతో చాలా వీడియోలను సోషల్ మీడియాలో తొలగించడం గమనార్హం.

Also Read: Sonu Sood : బన్నీ కోసం బరిలోకి దిగనున్న సోనూసూద్.. ‘పుష్ప’లో నటించనున్న జులాయి విలన్.?

K. Raghavendra Rao: దర్శక విశిష్టుడు.. ఇప్పుడు ‘వశిష్ట’గా మారారు.. ఆడియన్స్‌కి న్యూ ఫీల్‌నివ్వడానికి రెడీ అయిన దర్శకేంద్రుడు