Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

నభా నటేష్.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..
Nabha Natesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2021 | 12:45 PM

Nabha Natesh: నభా నటేష్.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌‌‌గా మారిపోయింది. సుధీర్ బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్‌‌‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేష్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో అమ్మడి అందానికి.. నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. యంగ్ హీరోల‌కు ఫ‌స్ట్ చాయిస్‌‌‌గా మారిన హీరోయిన్ న‌భా న‌టేష్..  బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది బాలీవుడ్‌‌‌‌లో అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. అదికూడా ఓ స్టార్ హీరోసరసన నటించనుందని తెలుస్తోంది.

బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్ సరసన నభా నటేష్ నటిస్తోందని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే అది సినిమా కోసం కాదట. హిందీలో హృతిక్ రోషన్ నటిస్తోన్న ఓ వెబ్ సిరీస్ లో నభాటేష్ కు ఛాన్స్ దక్కిందట. జాన్‌ లే కర్రె రాసిన పుస్తకం ఆధారంగా రూపొందిన సూపర్ హిట్ బ్రిటిష్ గూఢచారి థ్రిల్లర్ ‘ది నైట్ మేనేజర్’ అనే సిరీస్‌‌‌‌‌ను బాలీవుడ్‌‌‌‌‌లో రీమేక్ చేస్తున్నారు. దీంతో తొలిసారి డిజిటల్‌‌‌‌లోకి అడుగుపెడ్తున్నాడు హృతిక్. ఈ సిరీస్ కోసం నభానటేష్‌‌‌‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మొదటిసారి దీపికా పదుకొనే హృతిక్ సరసన నటిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sonu Sood : బన్నీ కోసం బరిలోకి దిగనున్న సోనూసూద్.. ‘పుష్ప’లో నటించనున్న జులాయి విలన్.?

K. Raghavendra Rao: దర్శక విశిష్టుడు.. ఇప్పుడు ‘వశిష్ట’గా మారారు.. ఆడియన్స్‌కి న్యూ ఫీల్‌నివ్వడానికి రెడీ అయిన దర్శకేంద్రుడు

Karthika Deepam: ట్విస్ట్ ఇద్దమనుకుంటే షాక్ ఇచ్చిన కార్తీక్..దీప..మోనిత నషాళానికి అంటిన అంజి ‘పాన్’ మసాలా!