K. Raghavendra Rao: దర్శక విశిష్టుడు.. ఇప్పుడు ‘వశిష్ట’గా మారారు.. ఆడియన్స్‌కి న్యూ ఫీల్‌నివ్వడానికి రెడీ అయిన దర్శకేంద్రుడు

నవతరం దర్శకులు కనిపెట్టిన 2.ఓ ఎక్స్‌పరిమెంట్‌ దర్శకేంద్రుడి క్కూడా బాగా వంటబట్టినట్టుంది. పాతికేళ్ల కిందటి పెళ్లి సందడికి ఇప్పుడు వెర్షన్-2 ప్లాన్ చేసి.. దాన్ని జబర్దస్త్‌గా తెరకెక్కించే పనిలో బిజీగా వున్నారు.

K. Raghavendra Rao: దర్శక విశిష్టుడు.. ఇప్పుడు 'వశిష్ట'గా మారారు.. ఆడియన్స్‌కి న్యూ ఫీల్‌నివ్వడానికి రెడీ అయిన దర్శకేంద్రుడు
Raghavendra Rao
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2021 | 8:15 AM

K. Raghavendra Rao: నవతరం దర్శకులు కనిపెట్టిన 2.ఓ ఎక్స్‌పరిమెంట్‌ దర్శకేంద్రుడి క్కూడా బాగా వంటబట్టినట్టుంది. పాతికేళ్ల కిందటి పెళ్లి సందడికి ఇప్పుడు వెర్షన్-2 ప్లాన్ చేసి.. దాన్ని జబర్దస్త్‌గా తెరకెక్కించే పనిలో బిజీగా వున్నారు. తన మేజిక్‌ ఆఫ్ మేకింగ్‌ని న్యూజెన్‌కి ఇంట్రడ్యూస్ చెయ్యాలన్న ఆయన తపన, తాపత్రయం.. ఏ రేంజ్‌లో వుందో ఈపాటికే తెలిసిపోయింది. ఇక్కడితోనే ఆగలేదు… తన రియల్‌ లైఫ్‌లో కూడా నయా వెర్షన్‌ని ఆవిష్కరించడం షురూ చేశారు రాఘవేంద్రుడు. మితభాషి అని… మహా బిడియస్థుడని… కెమెరా ఫేసింగ్‌కి దూరంగా వుంటారనేది రాఘవేంద్రరావు గురించి అందరూ చెప్పేమాట. తన సినిమా ఈవెంట్స్‌లో కూడా వేదిక మీద మూడు మాటల కంటే మించకుండా మాట్లాడతారు. అసలాయన గొంతు ఎలా వుంటుందో విందామని ఆశగా చూసేవారు ప్రేక్షకులు. కానీ.. అదంతా గతం. రీసెంట్ ఇయర్స్‌లో ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడా మార్పు బాగా ముదిరి పీక్స్‌లోకెళ్లింది.

శతాధిక చిత్రాలు తీసి.. పెద్దపెద్ద స్టార్లకే మోస్ట్ ఫేవరిట్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న తాను.. ఇలా ఒక మూలన నిలబడ్డం పద్ధతి కాదనుకున్నారో ఏమో… ఒక్కసారిగా జూలు విదిల్చారు. ప్రముఖ టెలివిజన్ ఛానల్ ద్వారా… తన ప్రస్థానాన్ని తన నోటి ద్వారానే చెప్పుకోవాలని డిసైడయ్యారు. దర్శకేంద్రుడి సినీ జీవితానికి అందమైన ఆవిష్కరణ సౌందర్యలహరి. ఒక్కో ఎపిసోడ్‌ని ఒక్కో అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్ది భళా అనిపించుకున్నారు. తన మేకింగ్ స్టయిల్‌ని తానే విడమర్చి చెబుతూ… సగటు సినిమా దర్శకుడికి కేస్ స్టడీగా మారారు దర్శకేంద్రుడు.

మాట్లాడటం అంటూ మొదలుపెడితే నాకంటే ఎవ్వడూ గొప్పగా మాట్టాడలేడు అంటూ… ప్రతీ వేదిక మీదా మాట్లాడుతూ.. మెచ్యూర్డ్ స్పీకర్‌గా మారారు రాఘవేంద్రరావు. ఆయనలో కొత్త వెర్షన్ చూడ్డానికి అలవాటు పడ్డ సినీ జనానికి.. మరో సరికొత్త రుచిని అందిస్తానంటూ పెళ్లిసందడి సీక్వెల్‌కి నడుం కట్టారు. అక్కడితో ఆగకుండా ఆ సినిమాకు మేజర్ కమర్షియల్ ఎలిమెంట్ నేనే అంటూ తెరంగేట్రం చేశారు. వశిష్ట అనే పాత్రలో నటిస్తూ… 79 ఏళ్ల వయసులో కూడా పైలాపచ్చీసు కుర్రాడి గెటప్ వేసి… ఆడియన్స్‌కి న్యూ ఫీల్‌నివ్వడానికి రెడీ అయ్యారు. ఇది దర్శకేంద్రుడి వెర్షన్‌ 2.ఓకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్….! దాన్ని గ్లామరస్‌గా డిజైన్ చేసుకోవడం మన చేతుల్లోనే వుంది.. అనే మోటివేషన్‌ని మాటలు కాదు… చేతలతో స్ప్రెడ్ చేస్తున్నారు దర్శకేంద్రుడు. ఒక మనిషి తన జీవితాన్ని ఎలా అనుకుంటే అలా మలుచుకోవచ్చని… గిరిగీసుకుని బతకాల్సిన అవసరం లేదని, ఏ దశలోనైనా ట్రాన్స్‌ఫామ్ కావొచ్చని… చెప్పడానికి రాఘవేంద్రరావు కంటే మించిన రోల్ మోడల్ మరొకరు లేరేమో!

(రాజా శ్రీహరి TV9  ET Desk)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aakaasam Nee Haddhu Ra: యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన సూర్య సాంగ్.. ‘కాటుక కనులే’ పాటకు భారీ వ్యూస్..

Allu Sirish : శరవేగంగా ‘ప్రేమ కాదంట’ మూవీ షూటింగ్.. డబ్బింగ్ కూడా మొదలుపెట్టేసిన అల్లు శిరీష్..