Cinemas reopen: బొమ్మ పడినా కనిపించని జోష్.. ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ అన్నట్టుగానే సీన్
తెలుగు రాష్ట్రాల్లో సినిమా జోష్ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. మొదటి రోజే కావడంతో జనాల నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. థియేటర్లలో...
తెలుగు రాష్ట్రాల్లో సినిమా జోష్ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. మొదటి రోజే కావడంతో జనాల నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. థియేటర్లలో టికెట్లు కూడా ఆశించిన మేర అమ్ముడుపోలేదు. థియేటర్లలో ఎక్కడ చూసినా కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్టుగానే సీన్ కనిపించింది. పెద్ద సినిమాలు లేకపోవడం.. కరోనా భయంతో సినీ అభిమానులు థియేటర్లకు వచ్చేందుకు అంత ఇంట్రెస్టింగ్‌గా లేనట్టు కనిపిస్తోంది. మరోవైపు జనాలు.. ఓటీటీలకు అలవాటు పడటం కూడా కొంత ప్రభావాన్ని చూపుతోంది. 300 పైగా థియేటర్స్‌లో తిమ్మరుసు, మరో 300 థియేటర్స్‌లో ఇష్క్ సినిమాలు రిలీజ్ చేశారు. వీటితో పాటే నరసింహపురం, ఇప్పుడుకాక ఇంకెప్పుడు, పరిగెత్తు పరిగెత్తు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకుల రెస్పాన్స్‌ను బట్టి పెద్ద సినిమాలు రిలీజ్ డేట్‌లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా మినహా రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరుచుకున్నాయి. టిక్కెట్ రేట్ల విషయంలో అసంతృప్తి ఉన్న తూర్పుగోదావరి థియేటర్ యజమానులు డోర్లు తెరవలేదు. జిల్లాలో కరోనా కేసుల ఉధృతి, పలుచోట్ల కర్ఫ్యూ కూడా అమలవుతూ ఉండటం వారు ఈ నిర్ణయం తీసుకోడానికి మరో కారణంగా చెప్పవచ్చు. అయితే ఫస్ట్ వేవ్ అనంతరం మాత్రం జనాలు థియేటర్లకు ఎగబడ్డారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఆడియెన్స్ పెద్ద తెరపై సినిమా చూసేందుకు క్యూ కట్టారు. అదే సమయంలో వచ్చిన రవితేజ ‘క్రాక్’ సినిమా మోత మోగించింది. అయితే ఈ ఏడాది కూడా లాక్‌డౌన్ విధించడం, మరో వైపు అందుబాటులోకి వచ్చిన ఓటీటీలతో జనం ఇళ్లలోనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు అలవాటు పడ్డారు. మరిప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై బొమ్మ చూసేందుకు సగటు అభిమాని ఆసక్తి చూపుతాడా? సినీ కార్మికులు, థియేటర్ యాజమాన్యాన్ని బతికిస్తాడా? చూడాలి మరి.
Also Read: ఆ గ్రామంలో అడుగు బయటపెట్టని జనం.. క్షుద్రపూజల కలకలం.. రాత్రిళ్లు కోళ్లు బలి