Cyber Crime: ఏకంగా తెలంగాణ డీజీపీ ఫొటోతోనే చీటింగ్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

ఈ మధ్య సైబర్ కేటుగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సామాజిక మాధ్యమాలనే వారు జనాల్ని మోసం చెయ్యడానికి ఎరగా....

Cyber Crime: ఏకంగా తెలంగాణ డీజీపీ ఫొటోతోనే చీటింగ్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు
Cyber Crime
Follow us

|

Updated on: Jul 31, 2021 | 7:38 AM

ఈ మధ్య సైబర్ కేటుగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సామాజిక మాధ్యమాలనే వారు జనాల్ని మోసం చెయ్యడానికి ఎరగా మార్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ ఫొటోతో చీటింగ్‌కు పాల్పడ్డాడు ఓ వ్యక్తి.  తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నాడు. చీటింగ్ చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా పిర్యాదు చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగాలు, బహుమతుల పేరుతో టోకరా…

సోషల్ మీడియా వేదికగా ఫేస్‌బుక్‌లో నకిలీ పేర్లు, ఫొటోలతో మోసాలు జరుగుతున్నాయి. యూరోపియన్‌ల ఫొటోలు పెట్టి ఉద్యోగాలు, బహుమతుల పేరుతో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన వ్యక్తి ఫిడెలిస్ ఒబిన్నని, అతనికి సహకరిస్తున్న బీహార్‌కు చెందిన మరో వ్యక్తి అనిల్‌కుమార్ పాండేని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 సెల్‌ఫోన్లు, వివిధ బ్యాంకులకు చెందిన 13 చెక్ బుక్స్, 65 ఏటీఎం కార్డులు, 17 స్వైపింగ్ మిషన్లు, నైజీరియా దేశానికి చెందిన పాస్‌పోర్ట్‌, 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 12 లక్షల రూపాయల లావాదేవీలను పోలీసులు నిలిపి వేశారు.

వీరు ఎక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, ఇంకా వీరి ముఠాలో ఎవరైనా ఉన్నారా అనే కేణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్‌ చాటింగ్‌లో ఉద్యోగాలు రావని, ఎవరు ఉద్యోగాలు ఇస్తామన్న అమాయకంగా నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. బహుమతులు, ఇతర సాకులు చెప్పేవారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. యువత సోషల్‌ మీడియా వాడకంపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ మోసాల గురించి ఎవరికి ఎలాంటి సమాచారం తెలిసినా భయపడకుండా పోలీసులకు సమాచారం తెలపాలని సూచించారు.

Also Read:మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌

పతకాల కోసం బరిలోకి భారత అథ్లెట్లు.. పీవీ సింధుకు నేడు కఠిన సవాలు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో