Viral Video: చూస్తుండగానే కుప్పకూలిన భారీ వాటర్ ట్యాంక్.. వైరల్ అవుతున్న భీకర దృశ్యాలు
Water Tank Collapsed Video: అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం కట్టిన వాటర్ ట్యాంకు. దానితోనే ఆ గ్రామానికి నీటి సరఫరా జరుగుతుంది. ఆ ట్యాంకు ఇళ్ల పక్కనే
Water Tank Collapsed Video: అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం కట్టిన వాటర్ ట్యాంకు. దానితోనే ఆ గ్రామానికి నీటి సరఫరా జరుగుతుంది. ఆ ట్యాంకు ఇళ్ల పక్కనే శిథిలావస్థలో ఉన్నప్పటికీ.. అధికారులు గుర్తించలేకపోయారు. తీరా ఆ వాటర్ ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టం ఎంటంటే ఆ వాటర్ ట్యాంకు కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేరు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. అయితే ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్ జునాఘడ్‌లోని కేశోద్ ప్రాంతం ఖీర్సారా గ్రామంలో చోటుచేసుకుంది. రెప్పపాటులో వాటర్ ట్యాంక్ నేలమట్టమై.. ఆ ప్రాంతమంతా జలమయమైంది. నీరు ప్రళయంలా ఎగసిపడ్డాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యంతోనే ట్యాంకు నేలమట్టమైందని, పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
వైరల్ వీడియో..
#WATCH | Gujarat: A 40-year-old overhead water tank in Khirsara village of Junagadh collapsed earlier today. No injuries or casualties were reported in the incident. pic.twitter.com/4XyMQ5fCiq
— ANI (@ANI) July 30, 2021
1.5 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ 40 ఏళ్ల క్రితం నాటిదని గ్రామస్థులు వెల్లడించారు. ఈ ట్యాంకు ఎప్పటినుంచో శిథిలావస్థలో ఉందని పేర్కొంటున్నారు. మధ్యాహ్నం వేళ ఈ ప్రమాదం జరగిందని ఖీర్సారా గ్రామస్తులు వెల్లడించారు. ట్యాంక్ కూలిన సమయంలో ఎవరైనా ఉంటే, పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే.. 2019 సంవత్సరంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా కూలిపోయి.. ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు.
Also Read: