Nithya Menon: పవన్‌ – రానా సినిమాలో నిత్యామీనన్‌.. పవన్‌కు భార్యగా నటించనున్న మలయాళం ముద్దుగుమ్మ.?

Nithya Menon: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాళ్ - రానాలు హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న...

Nithya Menon: పవన్‌ - రానా సినిమాలో నిత్యామీనన్‌.. పవన్‌కు భార్యగా నటించనున్న మలయాళం ముద్దుగుమ్మ.?
Nithya Menon In Pspkrana
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 31, 2021 | 7:00 AM

Nithya Menon: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాళ్ – రానాలు హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రస్తుతం ప్రొడక్షన్‌ నెం 12 వర్కింగ్‌ టైటిల్‌తో నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్‌, రానా ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇక కరోనా నిబంధనలు సడలించడంతో చిత్ర యూనిట్‌ సైతం ఈ సినిమా చిత్రీకరణను వేగంగా పరుగులు పెట్టిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్‌ ఓ కీలక అప్‌డేట్‌ను అందించింది. ఈ సినిమాలో మలయాళ నటి నిత్యా మీనన్‌ నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. దాదాపు రెండేళ్లుగా తెలుగు తెరపై కనిపించని నిత్య.. పవన్‌ సినిమాతో మళ్లీ తళుక్కుమనడం విశేషం. నిత్యాకు స్వాగతం పలుకుతూ మూవీ యూనిట్‌ శుక్రవారం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో నిత్య పవన్‌కు భార్యగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఇక రానాకు జోడిగా ఐశ్వర్య రాజేశ్‌ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా 2022 జనవరిలో విడుదల చేయనున్నారు. ఇక సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లేతో పాటు డైలాగ్స్‌ అందిస్తుండడం విశేషం.

నిత్యా మీనన్‌కు స్వాగతం చెబుతూ చేసిన ట్వీట్‌..

Also Read: Anasuya: వెండితెరపై అనుసూయ హవా.. మరో సినిమాలో వినూత్నమైన పాత్రలో…

తెరపైకి మరో బయోపిక్.. ప్రజల మనసులను గెలిచిన ఎమ్మెల్యే జీవిత కథగా..

టాలీవుడ్‏లో పాగా వేసేందుకు సిద్ధమైన హీరోయిన్ ఈ ఫోటోలో ఉంది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!