తెరపైకి మరో బయోపిక్.. ప్రజల మనసులను గెలిచిన ఎమ్మెల్యే జీవిత కథగా..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 30, 2021 | 8:37 PM

 Gummadi Narsaiah: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‏ల హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా..

తెరపైకి మరో బయోపిక్.. ప్రజల మనసులను గెలిచిన ఎమ్మెల్యే జీవిత కథగా..
Gummadi Narsaiah

Gummadi Narsaiah: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‏ల హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి పరిశ్రమ ప్రముఖుల జీవిత కథలను సినిమాగా రూపొందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రముఖుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రముఖ రాజకీయ నాయకుడి జీవిత కథ తెరపైకి రాబోతుంది.

ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.  టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం దర్శకుడు సుకుమార్ చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు.  ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Also Read: Sarkaru Vaari Paata: క్రేజీ అప్‏డేట్.. ఫేమస్ మ్యూజిక్ సంస్థకు ‘సర్కారు వారి పాట’ ఆడియో రైట్స్..

టాలీవుడ్‏లో పాగా వేసేందుకు సిద్ధమైన హీరోయిన్ ఈ ఫోటోలో ఉంది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

Narappa Success Meet: విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న’నారప్ప’ టీం.. సక్సెస్ మీట్ లైవ్..

Husband Kills Wife: ఆవేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. కడదాకా తోడుంటామంటూనే కడతేరుస్తున్నారు.. ఎందుకిలా..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu