Husband Kills Wife: ఆవేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. కడదాకా తోడుంటామంటూనే కడతేరుస్తున్నారు.. ఎందుకిలా..?
Husband Kills Wife: కట్టుకున్న వాడే కాలయముడవుతున్నాడు. ప్రేమించి పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకుని కలకాలం తోడుంటానని..
Husband Kills Wife: కట్టుకున్న వాడే కాలయముడవుతున్నాడు. ప్రేమించి పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకుని కలకాలం తోడుంటానని బాస చేసిన భర్తే హంతకుడిగా మారుతున్నాడు. అనుమానంతో ఒకడు.. ఆస్తి కోసం మరొకడు.. ఆవేశంతో ఇంకొకడు.. ఇలా మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తలే భార్యలను అత్యంత క్రూరంగా హత్య చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో వరుసగా నమోదవుతున్న కేసులు అందుకు సాక్షంగా నిలుస్తున్నాయి. మా అల్లుడు బంగారం అని నమ్ముతున్న నవ వదువు కుటుంబ సభ్యులకు ఈ హత్యలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
మంచిర్యాల బృందావన్ కాలనీ అరుణ్ కుమార్, నిర్మల్ కుంటాల మండలం అందకుర్ నిఖిల్, బెల్లంపల్లి అశోక నగర్ ఆసిప్.. ఈ ముగ్గురిది వేరు వేరు ప్రాంతాలే అయినా.. నేర చరిత్ర మాత్రం సేమ్. కట్టుకున్న భార్యల పాలిట కాలయముళ్లుగా మారిన భర్తలు వీళ్లు. అలా ఇలా కాదు.. అత్యంత కిరాతకంగా పక్కా ప్లాన్ వేసి మరీ భార్యలను బలి తీసుకున్న సైకోలు. ప్రేమించి కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్లే వీరంతా. కానీ వీళ్ల కన్నింగ్ ఆలోచనలు.. అనుమానాలు వీళ్లను కట్టుకున్న ఆ ముగ్గురు ఆడబిడ్డలను మాత్రం కాటికి పంపాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రం బృందావన్ కాలనీలో చోటు చేసుకున్న పూదరి విజయలక్ష్మి(47), ఆమె కుమార్తె రవీనా (25)ల హత్య ఘటన మరువక ముందే అంతకు మించిన అత్యంత దారుణమైన హత్య బెల్లంపల్లి అశోక్ నగర్ లో చోటు చేసుకుంది. బృందావన్ కాలనీలో అల్లుడు అరుణ్ కుమార్ అత్త విజయలక్ష్మి ని, భార్య రవీనాను పొట్టన పెట్టుకోగా.. బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో భార్య షాహినాను తన భర్త ఆసిప్ అత్యంత కిరాతంగా గొంతు కోసి హతమార్చాడు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ కు చెందిన షాహీన్ భర్త ఆసిఫ్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కరోనాతో లారీలు నడవక పని మానేశాడు. దాదాపు మూడు నెలలుగా ఆసిఫ్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆసిఫ్ కు అనుమానాలు మొదలయ్యాయి. భార్యాభర్తల తగాదా పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. అయితే, పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయినా నిలువెల్లా అనుమానంతో దహించిపోతోన్న ఆసిఫ్ పక్కా ప్లాన్ ప్రకారం భార్యను మట్టుపెట్టాలని స్కెచ్ వేశాడు. అనుకున్నట్టుగానే కొడుకుని పని ఉందంటూ బయటకి పంపించాడు. కూతురు స్నానం చేస్తుండగా టీవీ సౌండ్ పెద్దగా పెట్టి భార్య షాహీన్ గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఇటు నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోను సేమ్ సీన్. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకుర్ కు చెందిన నిఖిల్, భైంసా మండలం కమోల్ కు చెందిన గౌతమి (21) ని 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుంటాలలో ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు వీళ్లిద్దరు. గత కొద్ది రోజులుగా నిఖిల్ తన భార్య పై అనుమానం పెంచుకున్నాడు. ఈ మధ్య భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. మరింత అనుమానం పెంచుకొన్న భర్త నిఖిల్ భార్య గౌతమిని చున్నీతో హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ మూడు హత్యలు వేరు వేరే అయినా కారణాలు మాత్రమే ఒకటే.. అనుమానం. ఈ అనుమానమే పెనుభూతమై అమాయకుల ప్రాణాలను దహించివేస్తున్నాయి.
Also read:
HDFC Bank: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. డెబిట్ కార్డు లేకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోండిలా!
Brewery: సారాయి పారబోతకు చెరువు తవ్వకం.. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యదార్థం.!