HDFC Bank: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. డెబిట్ కార్డు లేకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోండిలా!

HDFC Bank: డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లారా.? డెబిట్ లేదా క్రెడిట్ కార్డును మర్చిపోయారా.? అయితే టెన్షన్ పడకండి.. కార్డ్‌లెస్ క్యాష్...

HDFC Bank: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. డెబిట్ కార్డు లేకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోండిలా!
Hdfc Bank
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 30, 2021 | 7:36 PM

డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లారా.? డెబిట్ లేదా క్రెడిట్ కార్డును మర్చిపోయారా.? అయితే టెన్షన్ పడకండి.. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే కొన్ని బ్యాంకులు కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం ద్వారా కార్డులెస్ క్యాష్ విత్‌డ్రా సౌకర్యాన్ని 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాను చేసుకోండిలా…

* మీ దగ్గరలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం దగ్గరకు వెళ్లి కార్డులెస్ క్యాష్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

* ఆ తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి

* నెక్స్ట్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి

* మెసేజ్ రూపంలో వచ్చిన ఓటీపీ‌ను ఎంటర్ చేయండి

* తద్వారా మీకు తొమ్మిది అంకెల అర్డర్ ఐడీ వస్తుంది. ఆ తర్వాత మీరు తీసుకోవాల్సిన అమౌంట్ ఎంటర్ చేయండి

*వివరాలను కన్ఫామ్ చేసిన తర్వాత డబ్బును ఉపసంహరించుకోవచ్చు.

Also Read: 

14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!

ధైర్యమంటే ఇదేనేమో.. భారీ నాగుపాముతో యువతి సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

ధావన్ స్థానాన్ని భర్తీ చేసేది ధోని శిష్యుడు మాత్రమే.. తెగేసి చెప్పిన మాజీ క్రికెటర్..

ఈ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోండి.? కనిపెట్టలేదా.! అయితే ఈ స్టోరీ చదవండి!