The Hundred: 14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!

The Hundred: పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన 'ది హండ్రెడ్' ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది...

The Hundred: 14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!
Bairstow
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 30, 2021 | 3:38 PM

పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ‘ది హండ్రెడ్’ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అసలే ఇన్నింగ్స్‌కు 100 బంతులు కావడంతో బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోతున్నారు. తాజాగా ఈ టోర్నీలో మూడు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ప్రేక్షకులకు కావల్సినంత మజా ఇచ్చింది. సన్‌రైజర్స్ ఓపెనర్, వెల్ష్‌ఫైర్ కెప్టెన్ జానీ బెయిర్‌స్టో సదరన్ బ్రేవ్‌పై తుఫాను ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయి తన జట్టుకు విజయాన్ని అందించాడు.

జాతీయ జట్టులో చేరే ముందు ఈ టోర్నమెంట్‌ చివరి మ్యాచ్‌ ఆడిన బెయిర్‌స్టో.. సదరన్ బ్రేవ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా ప్రత్యర్ధులపై తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. మొదట ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో బెయిర్‌స్టో 25 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత గేర్ మార్చాడు. చివరి 14 బంతుల్లో 44 పరుగులతో విజృంభించాడు. మొత్తానికి 39 బంతుల్లో 72 పరుగులు చేసిన బెయిర్‌స్టో తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లు బాదాడు.

బెయిర్‌స్టో, డకెట్ సూపర్ పార్టనర్‌షిప్..

కెప్టెన్ జానీ బెయిర్‌స్టో విధ్వంసంతో వెల్ష్ ఫైర్.. సదరన్ బ్రేవ్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో నాలుగు వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. బెయిర్‌స్టో(72), బెన్ డకెట్(53) రెండో వికెట్‌కు 100కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అటు ఓపెనర్ టామ్ బాంటన్ 23 బంతుల్లో 34 పరుగులు రాబట్టాడు. 166 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో సదరన్ బ్రేవ్ నిర్ణీత ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. జేమ్స్ విన్స్(40) అత్యధిక స్కోరర్. ఈ మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్ బౌలర్ నీషామ్ 15 బంతుల్లో 10 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. నీషామ్ తన మొదటి స్పెల్‌లో ఐదు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.

కాగా, ఈ టోర్నమెంట్‌లో జానీ బెయిర్‌స్టోకు ఇదే చివరి మ్యాచ్. ఆగష్టు 4 నుంచి భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ కోసం అతడు ఇంగ్లాండ్ జాతీయ జట్టులో చేరనున్నాడు. బెయిర్ స్టో ఇదే ఫామ్ టెస్టుల్లోనూ కొనసాగిస్తే.. టీమిండియాతో జరిగే టెస్టుల్లో ఇంగ్లీష్ జట్టు ఆధిపత్యం చెలాయించినట్లే.!

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే!

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?