AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే!

AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కొత్తగా 1180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు...

APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే!
Ap Government
Ravi Kiran
|

Updated on: Jul 29, 2021 | 8:14 PM

Share

కరోనా కాలంలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో కొత్తగా 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(APPSC)కు అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ తాజా ఉద్యోగాలను సైతం జాబ్ క్యాలండర్‌లో చేర్చాల్సిందిగా ఆదేశించింది. ఈ పోస్టులన్నింటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపచేయాలని పేర్కొంది. గ్రూప్-1, గ్రూప్-2, రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్‌లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ(APPSC) ఆగష్టులో జారీ చేసే అవకాశం ఉంది.

Orders

 

రాజమండ్రిలో నీట్ సెంటర్ ఏర్పాటు..

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు ఆ ప్రాంత ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇవాళ కేంద్రమంత్రిని ఢిల్లీలో కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్, పిల్లి సభాష్ చంద్రబోస్, చింతా అనురాధ ఈ మేరకు కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 13,000 మంది నీట్ అభ్యర్థులున్నారని పేర్కొన్న ఎంపీలు, వాళ్లంతా పరీక్ష కోసం 250-300 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోందని కేంద్రమంత్రికి విన్నవించారు.

ఏపీలో 11 నీట్ సెంటర్లున్నా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కటి కూడా లేదని పేర్కొన్న ఎంపీల బృందం.. వీరంతా విజయవాడ లేదా విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోందని, ఇది విద్యార్థులతోపాటు, అటు తల్లిదండ్రులకు కూడా ఇబ్బందికరంగా మారిందని కేంద్రమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.