E-commerce: ఫ్లాష్‌ సేల్స్‌లతో దూసుకెళ్తోన్న ఇ-కామర్స్ కంపెనీలకు కళ్ళెం.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానం

ఇ-కామర్స్‌ కంపెనీల వ్యాపార విధానాలకు దూకుడుకు కళ్ళెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు..

E-commerce: ఫ్లాష్‌ సేల్స్‌లతో దూసుకెళ్తోన్న ఇ-కామర్స్ కంపెనీలకు కళ్ళెం.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానం
Amazon And Flipkart
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 30, 2021 | 8:05 PM

E-commerce – Vijayasai Reddy: ఇ-కామర్స్‌ కంపెనీల వ్యాపార విధానాలకు దూకుడుకు కళ్ళెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఇ-కామర్స్‌ కంపెనీలు అనుసరిస్తున్న అనుచిత వ్యాపార విధానాలపై వ్యాపారుల, రిటైలర్లు, పారిశ్రామిక సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయని మంత్రి రాజ్యసభకు వివరించారు. అసాధారణ డిస్కౌంట్లు, అత్యంత తక్కువు రేట్లకు ఆన్‌లైన్‌లో ఉత్పాదనలు అమ్మకానికి పెట్టడం ద్వారా మార్కెట్‌పై సాధించిన ఆధిపత్యాన్ని ఇ-కామర్స్‌ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లుగా తమకు ఫిర్యాదులు అందాయని మంత్రి తెలిపారు. ఈ ఫిర్యాదులను లోతుగా విచారించి, పరిశీలించాల్సిందిగా సంబంధింత ప్రభుత్వ విభాగాలను కోరినట్లు మంత్రి చెప్పారు.

రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాష్‌ రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఇతరులెవరూ పోటీకి రాకుండా ఇ-కామర్స్‌ కంపెనీలు కొన్ని వాణిజ్య సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఆరోపిస్తూ కాంపిటీషన్‌ కమిషన్‌కు సైతం ఫిర్యాదులు అందినట్లు మంత్రి తెలిపారు. వీటిపై కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

నూతన ఇ-కామర్స్‌ విధానం ద్వారా ఇలాంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడే ఇ-కామర్స్‌ కంపెనీలకు కళ్ళెం వేస్తామని మంత్రి సోమ్ ప్రకాష్ చెప్పారు. ఇ-కామర్స్‌ నిబంధనలను సవరించడానికి ముందుగా ప్రభుత్వం వాటిపై వ్యాపార వర్గాల సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టినట్లు మంత్రి వెల్లడించారు.

Read also : Peddireddy: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?