Peddireddy: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీ గూటికి చేరారు. ఆయన్ను ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు...
Peddireddy – CM KCR – TRS Party: మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీ గూటికి చేరారు. ఆయన్ను ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. “పెద్దిరెడ్డి.. నేను.. కలిసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ప్రస్థానం ప్రారంభించి ఆపార్టీలో మంత్రుల స్థాయి వరకు ఎదిగామని పేర్కొన్నారు.
పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్న కేసీఆర్.. “చేనేత కార్మికులకు బీమా కలిపిస్తాము. రైతు బంధు, రైతు బీమా చేపట్టడానికి మకు ఏడాది కాలం పట్టింది. చేనేత బీమా కూడా కొద్దిరోజుల్లో వస్తుంది. దళిత సంక్షేమశాఖలో కూడా దళితులకు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నవాళ్లకు బీమా కలిపిస్తాము.” అని కేసీఆర్ ఈ సందర్బంగా ప్రకటించారు.
“పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తి అయితే ఇక తెలంగాణ కు డొక లేదు.. దళితబంధు కార్యక్రమం కరోనా వల్ల ఏడాది ఆలస్యం అయింది. తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం. కొంతమంది సన్నాసులకు అర్ధం కాదు. తెలంగాణ బలమైన రాష్ట్రం. ప్రజలకు విపక్షాల పట్ల విశ్వాసం లేదు. దళితబంధు పతాకం అనగానే బాంబు పడ్డట్టు ఆగం అవుతున్నారు. కేసీఆర్ ఒకసారి అనుకున్నాక ఆపడం ఎవరి తరం కాదు.” అని కేసీఆర్ తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జిగా పని చేశానని… అయినా హుజూరాబాద్‌లో తనను ఇన్ఛార్జీగా నియమించలేదని విమర్శించారు. తనకు చెప్పకుండానే ఈటలను బీజేపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు.
ఈటల రాజేందర్ దేవాలయ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు నిజమని కోర్టులో తేలితే… బీజేపీ ఏం సమాధానం చెపుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.